ఏపీ సీఎం జగన్ ఎంతటి మొండిఘటామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అని వాదించే రకం. అంతే కాదు తాను ఏమి చెప్పాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా చేసి చూపించడం జగన్ స్టైల్. ఆ వైకిరి కారణంగానే జగన్ తరచుగా వివాదాస్పదం అవుతున్నాడు. ఇక జగన్ తొమ్మిది నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలు అయితేనేమి, పథకాలు అయితేనేమి జగన్ అనుకున్నది అనుకున్నట్టుగా చేసి చూపించాడు. దీంతో జగన్ అంటే ఏంటో అందరికి అర్ధం అయిపోయింది. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక కానీ, రాకముందు కానీ మీడియా విషయంలో జగన్ వైకిరి ఎవరికీ అర్ధం అయ్యేది కాదు.


 అసలు మీడియా ను పట్టినుంచుకునే అంత తీరిక లేనట్టుగా, ఇష్టం లేనట్టుగా వ్యవహరించేవాడు. అసలు మీడియా ముందుకు వచ్చేందుకు కూడా జగన్ ఇష్టపడకుండా దూరం దూరంగా ఉంటూ ఉండేవాడు. దీంతో జగన్ మీడియాకు బయపడుతున్నాడు, లెక్క చేయడంలేదు అనే విమర్శలు వచ్చిన్నా పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు. అయితే ఇప్పుడు మీడియాకు దూరంగా ఉంటే కలుగుతున్న నష్టాలేంటో జగన్ కు బాగా తెలిసొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. అందుకే ఇక మీదట మీడియా ముందుకు వచ్చేందుకు జగన్ సిద్ధం అవుతున్నాడు. అంతే కాదు మీడియా ద్వారా వైసీపీ ప్రభుత్వం మైలేజ్ పెంచుకోవాలని చూస్తున్నట్టుగా ఆయన వ్యవహారం కనిపిస్తోంది.


 పది నెలల కాలంలో ఎపుడూ ఉపయోగించుకోలేదు. కానీ తొలిసారిగా ఆయన నలభై నిముషాలకు పైగా మాట్లాడి విపక్షం జాతకాన్ని బట్టబయలు చేశారు. ఈ పరిణామాలతో వైసీపీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. ఎన్నికల వాయిదా సంగతి పక్కనపెడితే జగన్ ఇలా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుని ఆడేసుకున్న తీరుని వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అదీ కాకూండా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మీడియాను వాడుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆయన వాడుకున్నట్టుగా మీడియాను వాడుకోవడంలో ఇంకెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు.


 అందుకే బాబు చేపట్టిన ఏ ఆందోళన అయినా, నిర్ణయం అయినా ప్రజల్లోకి బాగా ఫోకస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగానే జగన్ కూడా ఫోకస్ అవ్వాలని చుస్తునంట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా, కాస్త ఆలస్యం అయినా, జగన్ మంచి నిర్ణయమే తీసుకున్నారని చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: