చిన్న పిల్ల‌లు ఉన్న‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఇంటిని బ‌ట్ట‌ల‌ను తినే ఆహారాన్ని ప్ర‌తి దాన్ని చాలా శుభ్రంగా చూసుకోవాలి. ప‌సి పిల్ల‌ల‌ను ఎలా ప‌డితే అలా ముట్టుకోకూడ‌దు. బ‌య‌ట‌కు వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత చేతులు, కాళ్ళు శుభ్రంగా క‌డుక్కుని పిల్ల‌ల‌ను ఎత్తుకోవాలి. అలాగే వీల‌యినంత వ‌రకు పిల్ల‌ల‌కు ఈ నాలుగు రోజులు మంచి డెట్టాల్‌స‌బ్బుతో స్నానం చెయించ‌డం చాలా మంచిది. అలాగే ఇల్లు కూడా నీటిలో కొంచం ప‌సుపు వేసి తుడిస్తే చాలా మంచిది అని వైద్యులు తెలుపుతున్నారు. అలాగే పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు కూడా ఎక్క‌డికి తీసుకు వెళ్ళ‌డం కూడా శ్రేయ‌స్క‌రం కాదు.

 

ఒక‌వేళ త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు పిల్ల‌ల‌ను తీసుకువెళ్ళ‌వ‌ల‌సి వ‌స్తే మాస్క్‌లు, చేతికి, కాలికి సాక్స్‌లు వేసి చాలా జాగ్ర‌త్త‌గా తీసుకువెళ్ళాలి. అలాగే వీల‌యినంత వ‌ర‌కు ఎంత త‌క్కువ‌గా పిల్ల‌ల‌ను బ‌య‌ట ఉంటే అంత మంచిది. ఎందువ‌ల్ల‌నంటే క‌రోనా వైర‌స్ గాలి ద్వారా వ్యాపించే ఓ ప్రాణాంత‌క వ్యాధి. ఇక ఇదిలా ఉంటే...ఈ వ్యాధికి బ‌య‌ప‌డ‌ని వారు ఎవ్వ‌రూ లేరు. దీంతో బ‌య‌ట తిర‌గ‌డానికి కూడా జ‌నాలు భ‌య‌ప‌డుతున్నారు. 

 

ఇంకా పిల్ల‌ల‌కు పాలు ఇచ్చేట‌ప్పుడు కూడా శుభ్రంగా శ‌రీరాన్ని క‌డుక్కోవాలి. అలాగే బ‌య‌ట ఫుడ్ ఏదీ కూడా పిల్ల‌ల‌కు పెట్ట‌కూడ‌దు. ద‌గ్గు, జ‌లుబు ఉంటే వెంట‌నే డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కి తీసుకువెళ్ళాలి. ఆల‌స్యం చెయ్యకూడ‌దు. బ‌య‌ట‌జ్యూస్‌లు, ఫాస్ట్‌ఫుడ్ ఇలాంటివేమి కూడా పిల్ల‌ల‌కు తినిపించ‌కూడ‌దు. అలాగే బ‌య‌ట నుంచి ఫ్రూట్స్ లాంటివి తీసుకువ‌చ్చినా శుభ్రంగా క‌డిగి పిల్ల‌ల‌కు వాటిని ఇవ్వాలి. ఒక వేళ జ‌లుబు, ద‌గ్గు ఉన్న ప‌క్షంలో వేడినీటిని తాగిస్తే చాలా మంచిది. అలాగే ఎండు ఖ‌ర్జూరాన్ని రాత్రిపూట నాన్న‌బెట్టి ఉద‌యాన్నే ఆ నీటిని కాస్త గోరువెచ్చ‌గా చేసి పిల్ల‌ల‌కు తాగిస్తే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: