దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 160కు పైగా దేశాలకు కరోనా విస్తరించింది. కరోనా భారీన పడి 7,007 మంది మృతి చెందగా 1,75,000 మంది బాధితులుగా ఉన్నారు. భారత ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది. ఇటలీ, ఇరాన్, సౌదీ అరేబియా దేశాలలో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికీ కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టకపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
గత కొన్ని రోజుల నుండి పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే కరోనా నయమవుతుందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కరోనాకు మందు పారాసిటమాల్ అని చెప్పడంతో సోషల్ మీడియాలో ఇద్దరు నేతల వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం చర్యలు చేపట్టినా పారాసిటమాల్ గురించి ఇద్దరు సీఎంలు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్నాయి. 
 
కేసీఆర్ ఇప్పటికే కరోనాను కట్టడి చేయడానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నెలాఖరు వరకు స్కూళ్లు, థియేటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గుతుందా...? లేదా...? అనే ప్రశ్నలు తరచుగా వినిపిస్తూ ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (who) స్పందించింది. who ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటంతో పాటు దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. 
 
ఏస్పిరిన్, పారాసిటమాల్, బ్రూఫిన్ లాంటి ట్యాబ్లెట్లు ఉపయోగిస్తే కరోనా లక్షణాలు కనిపించకుండా ఉంటాయని వాటి వల్ల కరోనాను దాచిపెట్టగలమని who చెబుతోంది. కరోనాను పారాసిటమాల్ తో నివారించవచ్చని who ఎక్కడా చెప్పలేదు. అందువల్ల కరోనా లక్షణాలు కనిపిస్తే పారాసిటమాల్ ఉపయోగించడం వల్ల నష్టమే తప్ప లాభం చేకూరదు. కరోనా లక్షణాలుకనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. 

మరింత సమాచారం తెలుసుకోండి: