చైనాలోని వుహాన్ నగరంలో గుర్తించబడిన ప్రాణాంతకమైన కరోనా వైరస్... ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వైరస్ బారినపడి నాలుగు వేల మందికి పైగా మరణించారు. ఇంకెంతో మంది ఈ వైరస్ బారినపడి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఇక మొదట చైనాలో గుర్తించబడిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ దేశాలకు పైగా విస్తరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించింది. ఈ కరోనా  వైరస్ ను  ప్రపంచ మహమ్మారిగా గుర్తించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా అదే పేరు వినిపిస్తోంది. 

 

 అయితే ఈ మహమ్మారి వెలుగు  లోకి వచ్చి ఇప్పటికే రెండు నెలలు గడిచి పోతున్నా... ఈ వైరస్ కు  సరైన విరుగుడు మాత్రం లేదు. ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు  ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం మాత్రం దక్కడం లేదు. దీంతో ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు కరోనా  వైరస్ పై  ప్రజలకు అవగాహన కల్పించేలా పలు చర్యలు చేపట్టింది. ఇక ఈ మహమ్మారి భారత్ లోకి కూడా వ్యాపించగా  కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది . అయితే ఈ వైరస్ కు  ఎలాంటి విరుగుడు మందు లేదని... నివారణ ఒక్కటే దీనికి మార్గం అంటూ అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది .వ్యక్తి గత పరిశుభ్రత  ఎంతో ముఖ్యం అంటూ ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచిస్తోంది. 

 

 ముఖ్యంగా ఎక్కువగా జనాలు ఉండే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాస్కు ధరించాలి... అంతేకాకుండా ఎవరితో షేక్ హ్యాండ్ ఇవ్వరాదు. ఎవరైనా దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వారికి దగ్గరగా ఉండకూడదు. అంతేకాకుండా చేతులను సబ్బుతో ఎంతో శుభ్రంగా కడుక్కోవాలి ... చేతిలోని ప్రతి భాగానికి సబ్బు అంటేలా గోర్లను కూడా శుభ్రం చేసుకోవాలి. అంతేకాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇక కరెన్సీ నోట్ల మార్పిడి ని కూడా తగ్గించాలి. కరెన్సీ నోట్ల మార్పిడికి బదులు అవసరాలకు అనుగుణంగా... నెట్ బ్యాంకింగ్... లేదా ఆన్లైన్ పేమెంట్ లను ఉపయోగించాలి. ఇక కరోనా  లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించాలి. ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపడితే కరోనా  బారిన పడకుండా ఉండవచ్చు అంటూ ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: