చైనా దేశంలోని వుహాన్  నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మొదట చైనా  దేశాన్ని చిగురుటాకులా వణికించింది... ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇక మొన్నటివరకు చైనా కు మాత్రమే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వంద దేశాలకు పైగా ఈ మహమ్మారి వైరస్ పాకి పోయింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ పేరెత్తితే చాలు ప్రాణ భయంతో వణికి పోతున్నాయి. ఇక ఈ వైరస్ వెలుగులోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఈ వైరస్ కు  ఇప్పటివరకు సరైన విరుగుడు కనిపెట్టకకపోవడంతో ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది ఈ మహమ్మారి. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ కు  సంబంధించి ఆసక్తికర ట్విట్  పెట్టారు. చైనీస్ కరోనా వల్ల అమెరికా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఆసక్తికర ట్విట్ పెట్టారు. 

 

 చైనీస్ కరోనా వైరస్ వల్ల నష్టపోయిన ఎయిర్ లైన్స్ తో పాటు పలు పరిశ్రమలకు కూడా అండగా నిలుస్తామని... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అయితే డోనాల్డ్ ట్రంప్ పెట్టిన ట్వీట్ పై చైనా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా దేశపు సీనియర్ దౌత్యవేత్త ఆయన యంగ్ జేచి . ట్రంప్  సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. కరోనా  వైరస్ నియంత్రణకు తన దేశం తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నదని... ఇలాంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు  అంటూ వివరించారు. కరోనా  వైరస్ తమ దేశంలో వెలుగులోకి వచ్చిందని.. ఈ వైరస్ కారణంగా భారీ నష్టం వాటిల్లింది అంటూ తమ దేశాన్ని వేలెత్తి చూపడం మానేసి... ముందు ఈ  ప్రాణాంతకమైన కరోనా వైరస్ నియంత్రణకు అందరం కలిసికట్టుగా పని చేస్తే బాగుంటుంది అంటూ హితవు పలికారు చైనా సీనియర్ దౌత్యవేత్తగా యంగ్ జేచి. 

 

 


 అయితే అటు సోషల్ మీడియా వేదికగా ట్రంపు పెట్టిన పోస్ట్ పై నెటిజన్ల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ట్రాప్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ కామెంట్లు పెడుతుంటే... ఇంకొంతమంది ట్రంపు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తున్నారు. కొంతమంది ట్రంపు వ్యాఖ్యలకు మద్దతిస్తూ సరిగ్గా చెప్పారు అంటూ కామెంట్ పెడితే ఇంకొంతమంది చైనీస్ వైరస్ అనడం జాత్యహంకారం అవుతుంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్ గురించి ఏదైనా మాట్లాడినప్పుడు స్పష్టమైన భాషను వాడాలి అంటూ ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా ఎవరిని దూషించ వద్దు అంటూ తెలిపింది. ఏదేమైనా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ట్వీట్  సోషల్ మీడియాలో సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: