ప్రస్తుత సమాజంలో ఆకతాయిల ఆగడాలు ఎక్కువైయ్యాయి. రానురాను వారి ఆగడాలకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు ప్రేమ, పెళ్లి అంటూ వారిని వేధిస్తూ వారి వెంట పెడతారు. వారికీ లొంగకపోతే వారిపై ఎలాంటి అఘాయిత్యం చేయడానికైనా వెనుకాడరు. ఈ ఆకతాయిల ఆగడాలకు చాలా మంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి ఒక్క ఆకతాయి బుద్ధి చెప్పింది  ఓ తల్లి. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సా కోడేరులో చోటు చేసుకుంది. 

 

 

పదో తరగతి విద్యార్థిని ఆటో డ్రైవర్ కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు. స్కూల్‌కు వెళ్లే సమయంలో ఆమె వెంటపడుతున్నాడు. అతడి వేధింపులు రోజు రోజుకు ఎక్కువ కావడంతో ఇంట్లో తల్లికి విషయం చెప్పింది. ఆటో డ్రైవర్ తన కూతుర్ని వేధిస్తున్నాడని తెలియడంతో ఆ తల్లికి కోపం కట్టలు తెంచుకుంది. ఆటో డ్రైవర్ తన కూతురి జోలికి రాకుండా చేయాలి అనుకుంది. ఆ యువకుడికి ఎలాగో ఆలా బుద్ధి చెప్పలని నిర్ణయించుకుంది.

 

 

ఆటో డ్రైవర్‌ను స్కూల్ సమీపంలోని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. స్కూల్ లోపలికి తీసుకెళ్లి విద్యార్థులంతా చూస్తుండగా స్థానికులతో కలిసి చితకబాదింది. ఇంకోసారి అమ్మాయిల్ని వేధిస్తావా అంటూ గుణపాఠం చెప్పింది. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించింది. విద్యార్థిని వేధించిన ఆటో డ్రైవర్ పేరుపాలెంకు చెందినవాడిగా గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన బయటపడింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

ఒక్కవైపు ఆడపిల్ల రక్షణ కొరకు అటు దేశంలోను, ఇటు రాష్టంలోను సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. ఆడపిల్ల కోసం తాజాగా ఏపీలో దిశ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే అమ్మాయిల రక్షణ కోసం కొన్ని యాప్స్ కూడా రూపొందించారు. ఆడపిల్లలు ఆకతాయిల నుండి వారిని వారు రక్షించుకోవడం కోసం కరాటే నేర్చుకుంటే కొంత మేరకు అయినా వీటిని అరికట్టవచ్చు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: