మన పూర్వీకులు తమ ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. ముఖ్యంగా ఈ కాలంలో ఉన్నంతగా పొల్యూషన్ అప్పట్లో ఉండేది కాదు.  పచ్చదనం, పరిశుభ్రత ఎంతగానో పాటించేవారు.  ఆహారపు అలవాట్లు, మంచినీరు వీటన్నింటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆయురారోగ్యాలతో ఉండేవారు. అప్పట్లో కాపర(రాగి) చెంబులు, గిన్నెలు వాడటం వల్ల అనారోగ్యాలకు చెక్ పెట్టవొచ్చు. ఇప్పుడు స్టీల్, ఫైబర్, ప్లాస్టీక్ వాడకం పెరగడంతో మనిషి ఆరోగ్యం మట్టికొట్టుకు పోతుంది. స్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు కాపర్ తో చెక్ పెట్టవచ్చు అంట. కాపర్ మన చెంత ఉంటే కరోనా మన దరి చేరే అవకాశమే లేదంటున్నారు. రాగి వాడటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు అని వైద్యులు కూడా చెబుతున్నారు.

 

సూర్యుని నుంచి విడుద‌ల‌య్యే పాజిటివ్ శ‌క్తి రాగి ఆభ‌ర‌ణాల ద్వారా నేరుగా మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  కాప‌ర్ జ్యువెల్ల‌రీని ధ‌రించ‌డం వ‌ల్ల మ‌న‌స్సు ఎల్ల‌ప్పుడూ ప్ర‌శాంతంగా ఉంటుంద‌ట‌. ఎలాంటి ఆందోళ‌న‌, ఒత్తిడి ద‌రి చేర‌వ‌ట‌.  శ‌రీరానికి చ‌ల్ల‌దనాన్నిచ్చే గుణం రాగిలో ఉంది. క‌నుక రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తే శ‌రీర ఉష్ణోగ్ర‌త పెర‌గ‌దు. దీంతో జ్వ‌రం వంటి వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.  బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. గుండె కొట్టుకోవ‌డం స‌హ‌జ ప్ర‌క్రియ‌లో, సాధార‌ణ రేటులో జ‌రుగుతుంది.  శ‌రీరంలో ఉన్న వాపులు, నొప్పులు త‌గ్గిపోతాయి.

 

ప్ర‌ధానంగా కీళ్ల నొప్పులు త‌గ్గిపోతాయి.జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. గ్యాస్‌, అసిడిటీ దూర‌మ‌వుతాయి.  ఇన్ ఫ్యూయంజా,ఈ కోలి వంటి బ్యాక్టీరియా,MRSAవంటి సూపర్ బగ్స్ లేదా ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కూడా గట్టి ఉపరితలంపై ల్యాండ్ అయితే అవి నాలుగు నుంచి ఐదు రోజుల వరకు జీవించగలదు.   రాగిపై, కాపర్ మిశ్రమాలపై ల్యాండ్ అయితే మాత్రం కొన్ని నిమిషాల్లోనే చనిపోతుందని సౌతాంఫ్టన్ యూనివర్శి ఆఫ్ సౌతాంఫ్టన్ లోని ఎన్విరాన్మెంటల్ హెల్త్ కేర్ ఫ్రొఫెసర్ బిల్ కీవిల్ తెలిపారు. యాంటీమైక్రోబయాల్ మెటీరియల్ అని ఆయన అన్నారు. ఇది కరెంట్ లేదా బ్లీచ్ అవసరం లేకుండానే దాని ఉపరితలాన్ని స్వీయ-క్రిమిరహితం చేస్తుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: