చైనా నుంచి ప్రారంభమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించేస్తోంది. చైనాలోని పుహాన్ నగరంలో ప్రారంభమైన కరోనా వైరస్ ఎల్లలు దాటి కుంటూ క్రమక్రమంగా ఒక్కో దేశం పై ఎటాక్ చేస్తూ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంటుంది. ఈ క్రమంలోనే భారత్లో ఇప్పటివరకు 130 మంది కరోనా వైరస్ కు గురయ్యారు. ఈ వైరస్ సోకిన వారిలో ముగ్గురు చనిపోయారు. భారత ఆర్థిక వ్యవస్థ సైతం క‌రోనా దెబ్బ‌తో అతలాకుతలం అవుతోంది. ఇక  ప‌లు క్రీడల ఈవెంట్లు సైతం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ వున్న ఐపీఎల్ సైతం ఇప్పటికే వాయిదా పడింది. ఎన్నో రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు సైతం వాయిదా పడుతున్నాయి.



ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి అనేక పరీక్షలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు రాజకీయ పార్టీలు సైతం క‌రోనా దెబ్బకు గజగజ వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం కరోనా విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క‌రోనా వైర‌స్ భారీన ప‌డ‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ఇప్పటికే పార్టీ నేత‌ల‌కు.. కార్య‌క‌ర్త‌ల‌కు ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు.



తాజాగా చంద్ర‌బాబు పార్టీ కేంద్ర కార్యాల‌యంలో కూడా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అత్య‌వ‌స‌ర‌మైన ప‌నులు మిన‌హా యించి ... జిల్లాల నుంచి మంగ‌ళ‌గిరిలోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యానికి నేత‌లు ఎవ్వ‌రూ రావొద్ద‌ని సూచ‌న‌లు జారీ చేశారు. ఇదే సూత్రం ఎమ్మెల్యేల‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. 100 డిగ్రీల శరీర ఉష్ణోగ్రత నమోదైన వారిని పార్టీ కార్యాలయంలోకి అనుమ‌తించ కూడ‌ద‌ని.. స్కానింగ్ త‌ర్వాతే వారిని లోప‌ల‌కు ఎలావ్ చేయాల‌ని సైతం బాబు చెప్ప‌డంతో అక్క‌డ సిబ్బంది అప్రమ‌త్తంగా ఉంటున్నార‌ట‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: