ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీ ఎన్నికల కమిషన్ పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే నామినేషన్ ముగిసిన తర్వాత మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కరోనా వైరస్ వల్ల వచ్చే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా నిలిపి వేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే జగన్ రాష్ట్రంలో మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవంగా గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇలాంటి సమయంలో జగన్ కు నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న నిర్ణయం పెద్ద దెబ్బ అనే చెప్పాలి.


వెంటనే జగన్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసలు కరోనా గురించి ఇంత పెద్ద రచ్చ చేయాల్సిన అవసరమే లేదని మామూలు జ్వరం కి వాడే పారాసెట్మాల్ టాబ్లెట్ తో దానిని అరికట్టవచ్చని సీఎం చెప్పడం తీవ్ర సంచలనానికి తెర లేపింది. అంతేకాకుండా జగన్ ఒక ఆరు గంటల పాటు బ్లీచింగ్ పౌడర్ వాడితే కరోనా వైరస్ ను నివారించవచ్చు అని చెప్పడం కూడా గమనార్హం. ఆతర్వాత నిమ్మగడ్డ రమేష్ ను అతను చంద్రబాబు కులానికి చెందిన వాడని... ఇద్దరు కలిసి పథకం ప్రకారం కావాలని వైసీపీని దెబ్బకొట్టేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని అన్నారు.


ఇకపోతే జగన్ మరియు అతని ప్రభుత్వం ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయం పై తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈరోజు సుప్రీంకోర్టులో హియరింగ్ జరగవలసి ఉండగా సుప్రీం కోర్టువారు కూడా కరోనా వైరస్ యొక్క ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కేసు విచారణను మార్చి 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఒక పక్క కరోనా వల్లే తమ రాష్ట్రంలో జరగవలసిన స్థానిక ఎన్నికలు వాయిదా పడితే అదే వైరస్ వల్ల మళ్లీ తను ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ కూడా వాయిదా పడడం జగన్ కు అసలు నమ్మశక్యంగా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: