భారత దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో  కరోనా వైరస్ పట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ పై ప్రజల్ని ఆందోళన కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యానాద్ కరోనా వైరస్ టెస్ట్ ల్ని వ్యతిరేకించే వారిపై  హెచ్చరికలు జారీ చేశారు. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ దాదాపు 150 దేశాలకు వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షా 70 వేల మందికి ఈ వైరస్ సోకింది. దాదాపు 6 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

 

అత్యధికంగా చైనాలో 81 వేల మంది వైరస్ బారినపడగా.. 3,217 మంది మరణించారు.  అమెరికాలో 3600 మంది కరోనా బారినపడగా.. 69 మంది మరణించారు.  ఇటలీలో 25 వేల మందికి వైరస్ సోకింది. ఆ దేశంలో 1809 మంది మృతి చెందారు.  భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 128కి చేరినట్లు మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో ముగ్గురు మరణించగా.. 13 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.  ఇక  కరోనా వైరస్ పై అసత్య ప్రచారం చేసినా, ప్రజల్ని భయాందోళనకు గురిచేసినా కఠినంగా శిక్షిస్తామన్నారు.

 

దీంతో పాటు వైరస్ పై టెస్ట్ చేయించుకు నేందుకు తిరస్కరించే వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హెల్త్ మినిస్టర్ జై ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ ఎపిడిమిక్ డిసీజ్ యాక్ట్  సెక్షన్-3 కింద నిందితుల్ని శిక్షిస్తామన్నారు.  ఇప్పుడు కరోనా అంటే భయపడాల్సిన అవసరం లేదు.. ఒకవేళ ఈ లక్షణాలు గనక ఉంటే వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలని అన్నారు. కరోనా టెస్ట్ లు చేయించుకునేందుకు తిరస్కరించినా, డాక్టర్ల విధులకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే  నేరస్థులను  చట్ట ప్రకారం జైలుకు పంపుతామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: