నిర్భయపై హత్యచార కేసులో నిందితులలోని ఒక్కడైనా ముకేశ్ సింగ్ తాజాగా ఢిల్లీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ లో... తనని 2012వ సంవత్సరంలో డిసెంబర్ 17న రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొచ్చారని, నిర్భయ అత్యాచార ఘటన జరిగిన రోజు అనగా డిసెంబర్ 16న తను ఢిల్లీలో లేనేలేనని, తనని అవసరంగా తీహార్ జైల్లో చిత్రహింసలకు గురి చేస్తున్నారని' పేర్కొన్నాడు. అయితే అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రానా కాసేపట్లో తీర్పును వెలువరించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్... ముకేశ్ సింగ్ ఉరిశిక్ష వాయిదా వేసేందుకు ఇలా ఉద్దేశ్యపూర్వకంగానే ఇలాంటి వాదనలు చేస్తున్నాడని చెబుతున్నాడు. 

 


ఏది ఏమైనా నిర్భయ హత్యాచారం లాంటి కేసుని మన న్యాయవ్యవస్థ చరిత్రలో ఎన్నడూ చూడలేదేమో. ఈ కేసులో నిందితులు ఇంకా వారి తరపు లాయరు ఇండియన్ న్యాయవ్యవస్థని, చట్టాలను, ప్రభుత్వాలను వాళ్లకి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ అపహాస్యం చేస్తున్నారు. దోషుల తరఫు లాయర్ ఏపీ సింగ్ కు మనం హాట్సాఫ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతనే లేకపోతే మన న్యాయవ్యవస్థలో ఉన్న డొల్లలు, లోపాలు ఎవరికీ తెలిసేవి కావు. భారతదేశ న్యాయవ్యవస్థ మొత్తం అన్యాయం వైపే మొగ్గుచూపుతుందని ఏపీ సింగ్ ప్రతి సందర్భంలోనూ స్పష్టం చేస్తూనే ఉన్నాడు. 

 

 

ఇక నిర్భయపై అత్యాచారం చేసి ఆమెని చంపేసిన దోషులు తాము నిర్దోషులమని చెప్పడం లేదు కానీ తమని ఉరితీయడానికి వీల్లేదని... ఎందుకంటే తమకు బతికే హక్కు ఉందని తెగేసి చెబుతున్నారు. వారి తరపు లాయర్ ఏపీ సింగ్ కూడా నానా రకాల పిటిషన్లు, మెలికలు పడేసి మన న్యాయవ్యవస్థ ఎంత చెత్తగా ఉందో ఇప్పటికే వందల సార్లు ప్రూవ్ చేశాడు. కానీ న్యాయవ్యవస్థ మాత్రం గాజులు వేసుకొని వీరి ఆటలను చూస్తుందే తప్ప ఏం చేయలేక పోతుంది. ఇవన్నీ గమనించిన తర్వాత కూడా పెద్ద ప్రసంగాలు చేస్తూ పెద్దపెద్ద మాటలు చెప్పే మోడీ కూడా మౌన ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి నిర్భయ తల్లిదండ్రులకు మన చెత్త న్యాయ వ్యవస్థ వలన అన్యాయం జరుగుతుంటే... ఏ ఒక్క రోజైన పార్లమెంటు సమావేశంలో మన చట్టాల గురించి, న్యాయ వ్యవస్థ గురించి మోడీ మాట్లాడగలిగారా?! తగిన చట్ట సవరణ అవసరమని చెప్పే బాధ్యత అతనికి లేదా? ప్రజల్ని నానా రకాల పిచ్చి నిర్ణయాలతో ఏడిపించడం తప్ప ఇలాంటి విషయాలలో మోడీ చేసేదేమీ లేదా?!

 


ఏపీ సింగ్... వన్ మ్యాన్ ఆర్మీ లాగా భారతదేశ న్యాయవ్యవస్థని ఒక ఆట ఆడిస్తూ పబ్లిక్ లోనే తన క్లయింటులకు ఉరిశిక్ష పడకుండా చేస్తానని సవాల్ చేశాడు. తను అన్నట్టే చేస్తున్నాడు కూడా. సర్జికల్ స్ట్రైక్ లు చేసి భుజం దులుపుకుంటే సరిపోతుందా?!... నిర్భయ దోషులను ఉరి తీయించి దేశ ప్రజలకు మన చట్టాల మీద విశ్వాసం కలిగించే సోయి మోడీకి లేక పోయిందా?

 

ఇంకో తమాషా విషయం ఏమిటంటే... నిందితుల కుటుంబ సభ్యులు కారుణ్యమరణానికి పాల్పడతామని ఏకంగా ఓ పిటిషన్ వేసి న్యాయ వ్యవస్థనే వెక్కిరిస్తూ బెదిరిస్తుంటే... అలాంటి పిటిషన్ వేసినందుకు వాళ్ళని బొక్కల వేయాల్సింది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు న్యాయవ్యవస్థ అంటే అందరికీ అపహాస్యం అయిపోయింది. ఏదిఏమైనా మోడీ అనే ఓ గొప్ప ప్రధానమంత్రికి సోయి ఉంటే పాటియాలా కోర్టు మార్చి 5న డెత్ వారంట్ జారీ చేసిన ప్రకారం మార్చి 20న ఉదయం ఐదున్నర గంటలకు దోషులను ఉరితీయాలి. ఎవరు అడ్డుపడినా వారి ప్రభుత్వాన్ని రద్దు చేసేంత ధైర్యం ఉండాలి. ఇందిరను మించిన నేతగా ప్రచారంలో చూపించడం కాదు, మోడీ. నీ గట్స్ ఏంటో చేతల్లో చూపించు.

మరింత సమాచారం తెలుసుకోండి: