ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మన భారత దేశంలో కూడా తన పంజా విసిరింది.  మహారాష్ట్ర, కేరళలో అత్యధికముగా కేసులు నమోదు అవుతున్నాయి.  కరోనా కారణంగా మన కేంద్ర మంత్రి  మురళీధరన్ తనకు తానుగా క్వారంటైన్ అయ్యారు.  ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకూడదని,ఢిల్లీలోని తన అధికారిక నివాసనం నుంచే తన కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారట. ఈ నిర్ణయం తీసుకోడానికి బలమైన కారణం లేకపోలేదు. 

 

 

 కరోనా లక్షణాలతో బాధపడేవారు ఎవరు ఉన్నాగాని వారికీ దూరంగా ఉండాలని ఆరోగ్య శాఖ తెలిపింది. మొదట 14 రోజులు కరోనా లక్షణాలు బయట పడవు. ఈ విషయం తెలియక మన కేంద్ర మంత్రి  ఒక మీటింగ్ కి అటెండ్ అయ్యారు. అక్కడే వచ్చింది చిక్కు మొత్తం. స్వతహాగా మురళీధరన్ కేరళ కి చెందిన వ్యక్తి.  కాగా  మార్చి-14న తిరువనంతపురంలోని పేరుపొందిన శ్రీ చిత్ర తిరునాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ(SCTIMST)లోని డైరక్టర్స్ ఆఫీస్ లో జరిగిన ఓ మీటింగ్ లో పాల్గొన్నారు. 

 

 

ఈ మీటింగ్ లో వివిధ డిపార్ట్మెంట్ ల హెడ్ లు పాల్గొన్నారు. అయితే ఈ డాక్టర్స్ లో ఒక డాక్టర్  విదేశం నుంచి తిరిగివచ్చాడు. మార్చి-1న స్పెయిన్ నుంచి తిరిగొచ్చిన ఈ హాస్పిటల్ లోని ఓ డాక్టర్(రేడియాలజిస్ట్)కు కరోనా సోకినట్లు ఆదివారం నిర్థారణ అయింది. మార్చి5వరకు ఆ డాక్టర్ హాస్పిటల్ లో పని చేసాడు. అప్పటివరకు ఆయనలో కరోనా లక్షణాలు కనిపించలేదు. అయితే ఆదివారం టెస్ట్ లలో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో హాస్పిటల్ ను మూసివేశారు. 

 

 


ఈ నేపథ్యంలో ఆరు ముఖ్యమైన డిపార్మెంట్లకు హెడ్ లుగా ఉన్న ఈ హాస్పిటల్ లోని డాక్టర్లు వాళ్లకు వాళ్లుగా ఇళ్లల్లోనే దిగ్భందన అయ్యారు.  కరోనా సోకిన డాక్టర్ ను నేరుగా కలిసిన 25మంది డాక్టర్లతో సహా 75మంది ఉద్యోగుల లిస్ట్ ను తయారు చేసి వారిని ఐసొలేట్ చేసినట్లు సమాచారం. వాళ్ల కుటుంబసభ్యులను కూడా ఇళ్లల్లోనే ఉండమని అధికారులు సూచించినట్లు సమాచారం.అయితే కేంద్ర మంత్రి కి వైరస్ సోకిందని ఇంకా నిర్దారణ కాలేదు. కానీ మీటింగ్ లో పాల్గొన్న కారణం చేత ఇంటికే పరిమితం అయ్యారు. సాధారణ మనిషినుంచి కేంద్ర మంత్రి దాక వణికిపోతున్నారు ఈ కరోనా వల్ల.

మరింత సమాచారం తెలుసుకోండి: