ఇటీవలే కరోనాపై మరో షాకింగ్ న్యూస్. కరోనా ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న సంగతి తెలిసినదే. అయితే కరోనా పై అనేక విధాలుగా ప్రభత్వం చర్యలు తీసుకోవడం కనపడుతున్న విషయమే. ఈ కరోనా గత రెండు రోజుల నుండి మహారాష్ట్ర లో వేగంగా దూసుకెళ్తోంది. అయితే పలు మంది ఆసుపత్రి నుండి కూడా పారిపోవడం చూస్తూనే ఉన్నాం. అందుకే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. నిజంగా ఇది షాకింగ్.

 

ఓటు వేసాక చేతి మీద సిరా ఎలా మార్క్ చేస్తారో అచ్చం అలానే వారిపై సిరా స్టాంప్ వేస్తున్నారట. ఈ నిర్ణయం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇళ్ళల్లోనే క్వారంటైన్ చేయబడిన వైరస్ అనుమానితుల ఎడమ చేతిపై సిరా స్టాంపులు వేస్తున్నారట. ఆ స్టాంప్ మీద ముంబాయి ప్రజల్ని రక్షిస్తున్నందుకు గర్వపడుతున్నాను అని దాని పై వ్రాసి ఉంది.

 

అలానే ఎవరి మీద అయితే ఆ స్టాంప్ ఉందో వారిని ఎంత సమయం వరకు అలా క్వారంటైన్ లో ఉండాలో కూడా దానిపై ఉంది. ఫలానా రోజులు వరకు అని కూడా దానిపై వ్రాసి ఉండడం జరిగింది. ఇలా ఈ పద్ధతిని అనుసరించడం వల్ల ప్రధమంగా లాభం ఏమిటంటే కరోనా అనుమానితులని గుర్తించడం బాగా సులభం అవుతుంది. సులువుగా కరోనా అనుమానితులుని గుర్తించడం జరిగి ప్రజల్నిసేవ్ చెయ్యడం జరుగుతుంది. ఈ సిరా స్టాంప్ ఇందుకు ఉపయోగపడుతుంది అంటూ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే చెప్పారు.

 

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 126 కి చేరాయి. గతంలో కొంత మంది ఆసుపత్రి నుండి పారిపోవడం వల్ల ఈ డెసిషన్ తీసుకున్నారట. మహారాష్ట్ర ప్రభుత్వం ఓటరుకి సిరా వేసినట్టే చేతి పై స్టాంప్ వేస్తున్నట్టు తెలిపారు.ఇది ఇలా ఉండగా భారత్ లో కరోనా మృతుల సంఖ్య మూడు కి చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: