ఒకప్పుడైతే పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో సంప్రదాయాలు కట్టుబాట్లు ఉండేవి. సంప్రదాయాల ప్రకారమే ఒకరిని ఒకరు వెళ్లి చూసుకొని ఆ తర్వాత పెద్దలు  ఒప్పుకొని లాంఛనాలు మాట్లాడుకుని  పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ రోజుల్లో మొత్తం అన్ని మాట్రిమోనీ పెళ్లిళ్లే  ఉన్నాయి. మాట్రిమోనియల్ సైట్లో సంబంధం చూడటం... ఆ తర్వాత అందరూ ఓకే చేయడం ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం. అయితే ప్రస్తుతం చాలామంది సమయం వృధా చేయకుండా మ్యాట్రిమోనీ సైట్ ల పైన ఎక్కువ ఆధారపడుతున్నారు. మాట్రిమోని సాహిత్యంలో అన్ని రకాల అబ్బాయిల ప్రొఫైల్స్ ఉండటంతో మంచి సెటిల్డ్ అబ్బాయిల కోసం ఎక్కువ కష్టపడాల్సిన..  పని లేకుండా పోతుంది. ఇదంతా పక్కన పెడితే మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా ఎంత  ఉపయోగం ఉందో  అంతే నష్టం కూడా ఉంది. కొంతమంది కేటుగాళ్లు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా తమను తాము ఎన్నారై  లేదా.. బిజినెస్ మెన్ గా  చూపించుకొని మోసాలకు పాల్పడుతున్నారు. 

 

 

 ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. మాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా ఇక్కడ ఒక వ్యక్తి తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఇక  మాయమాటలు చెప్పి ఏకంగా ఒక మహిళ దగ్గర నుంచి 18 లక్షలు స్వాహా చేశాడు . ఆ తర్వాత బాధితురాలు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గతేడాది డిసెంబర్ లో  గురు గ్రహం కు చెందిన ఒక మహిళకు.. ప్రముఖ మాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా సన్నీ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అయితే తాను లండన్ ఎన్ఆర్ఐ  అంటూ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. తనకి ఇంకా పెళ్లి కాలేదు అంటూ నమ్మబలికాడు. 

 

 

 ఇక ఆ తర్వాత ఆ యువతి తో మాట కలిపి చాటింగ్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తాను లండన్ నుంచి జనవరి 22న ఇండియాకు వస్తున్నాను అంటూ తెలిపాడు. అదే  రోజు ముంబై విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారులు పేరుతో ఓ మహిళ సదరు యువతికి ఫోన్ చేసి... సన్నీ హెచ్డీ లక్ష పౌండ్స్ తో  పట్టుబడ్డాడని..క్లియరెన్స్ కోసం కొత్త మొత్తం డబ్బు  చెల్లించాలంటూ చెప్పింది. దీనికోసం మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన బ్యాంకు ఖాతాల వివరాలను యువతికి  పంపింది. ఈ క్రమంలోనే బాధితురాలు  రెండు ఖాతాదారులకు 70వేలు,  95 వేల చొప్పున పంపింది. ఇక ఇంకేముంది నగదు జమ కాగానే  ఆ యువతికి వరుసగా మెయిల్స్ రావడం మొదలయ్యాయి . జనవరి 23 నుండి 30 వ తేదీన మధ్య సుమారు 18 లక్షలు పంపించింది యువతి . ఇక చివరికి సన్నీ అనే వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక మ్యాట్రిమోనీ వెబ్సైట్ నుంచి కూడా సన్నీ తన ప్రొఫైల్ తొలగించుకున్నాడు . దీంతో తాను మోసపోయానని గ్రహించి  పోలీసులను ఆశ్రయించింది యువతి. ఇక మార్చి 15న పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: