ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు రాజకీయ నాయకులను టార్గెట్ చేసి దారుణమైన పోస్టులు పెడుతున్నారు. అధికారంలో ఉన్నవారి ఫోటోలు, ప్రతిపక్షంలో ఉన్నవారి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఈ మార్ఫింగ్ ఫోటోలపై పలు సందర్భాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా సోషల్ మీడియాలో కొందరు చంద్రబాబును టార్గెట్ చేసి ఫోటోలు వైరల్ చేశారు. 
 
చంద్రబాబును టార్గెట్ చేసి ఆయన మార్ఫింగ్ ఫోటోలను ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. కొందరు చంద్రబాబు చచ్చిపోయారని పోస్టులు పెడుతూ రెచ్చిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోల పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు ఈ ఫోటోలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 
 
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వైరల్ అవుతున్న ఫోటోలపై స్పందించారు. వైసీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కించపరుస్తూ మార్ఫింగ్ ఫోటోలను వైరల్ చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ విమర్శించే టీడీపీ కార్యకర్తలను మాత్రం అర్ధరాత్రి అరెస్ట్ చేసే పోలీసులు ఈ ఫోటోల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 
 
ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఫోటోలను తాము రోజూ చూడాల్సి వస్తుందని చెప్పారు. మార్ఫింగ్ ఫోటోలు పెట్టినవారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని పోలీసులకు సూచించారు. గతంలో కొందరు ఇలానే నారా లోకేష్ ను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టారు. నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతా నుండి ట్వీట్లు చేయగా వాటిని మార్ఫింగ్ చేసి కొందరు వైరల్ చేశారు. తాజాగా చంద్రబాబును టార్గెట్ చేసి దారుణమైన పోస్టులు చేయడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.       

 

       

మరింత సమాచారం తెలుసుకోండి: