ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల భారత దేశం అల్లల్లాడుతుంది. అయితే ఇటీవల భారత్ లో కూడా వ్యాపించినవ్యాప్తి రోజు రోజు తీవ్రంగా మారుతున్న సంగతి తెలిసిందే.. కరోనా వైరస్ ఎలా వస్తుంది అనేది తెలియకుండా ప్రజలు బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.. అయితే ఇప్పుడు యావత్ ప్రజలు కరోనా పై భయపడుతున్నారు ..

 

 

 

కరోనా ప్రభావం వల్ల అనేక వాణిజ్య వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తిన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే కొన్నీ రాష్ట్రాల్లో ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇంట్లోనే కూర్చిని వర్క్ చేయాలనీ సూచించింది. ఇలాంటి టైములో సరదాగా స్నాక్స్ తీసుకోవాలని అనుకుంటారు. టైం వెస్ట్ కాకూండా ఇంట్లోనే ఉండేలా త్వరగా ఐపోయేలా ఉండే స్నాక్స్, లేదా తినుబండారాలను చేసుకోవాలని అనుకుంటాను అలాంటి వాళ్లకు ఈ స్నాక్స్ బెటరట.. అవేంటంటే 

 

 


వేపిన బఠాణీలు : బఠాణీల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. ఈ స్నాక్ త్వరగా పాడవ్వదు. పైగా మన బాడీకి అవసరమైన అమైనో యాసిడ్స్ బఠాణీల్లో ఉంటాయి. పైగా వీటిలో కేలరీలు తక్కువ. అందువల్ల... వేపిన బఠాణీలు రోజుకో అరకప్పు తింటే మంచిదే. అంతేకాక తొందరగా అలసట కాకుండా ఉంటారని సమాచారం. 

 

 


వీటితో పాటుగా బాదం, జీడిపప్పు, పిస్తా, వేరుశనగ గింజలు వంటివి ఆకలిని తగ్గిస్తాయి. చక్కటి ఎనర్జీ ఇస్తాయి. ఇంటి దగ్గర పనిచేసేవారు డ్రైఫ్రూట్స్, పప్పుల వంటివి తినడం తేలికగా ఉంటుంది. పని ఆపకుండా తినేందుకు ఇవి వీలుకల్పిస్తాయి. ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, రెండ మూడు జీడిపప్పు గింజలు, వాల్ నట్స్, ఫిగ్స్ వంటివి మధ్యమధ్యలో తింటే... ఆకలికి చెక్ పెట్టినట్లవుతుంది అని నిపుణు సూచిస్తున్నారు. డార్క్ చాకోలెట్స్ కూడా తింటే బెటర్ అని సూచించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: