నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈ పేరు ఇపుడు సోషల్ మీడియా సహా అంతటా పాపులర్ అవుతోంది. ఎందుకంటే ఆయన హఠాత్తుగా అదివారం ఉదయాన్నే స్థానిక ఎన్నికల ప్రక్రియ మొత్తం రద్దు చేశారు. దాంతో అది పెద్ద వివాదం అయింది. అటు ప్రభుత్వానికి ఇటు ఈసీకి పెద్ద జగడంగా మారింది.

 

ఎన్నికలను రద్దు చేసిన సంగతి కనీసం ఏపీ సర్కార్ తో సంప్రదించకుండా చేశారని ఇప్పటికే గుస్సా అవుతున్న వైసీపీ సర్కార్ కి మరో  విధంగా ఎన్నికల కోడ్ ని ఆరు వారాలకు పైగా పెంచేసి నిమ్మగడ్డ ఏకంగా మొత్తానికి  చేతులు కట్టేశారు. ఇపుడు ఏపీలో పాలన ఆగిపోయింది. ఎందుకంటే మంత్రులు పాలనా వ్యవహారాల్లో తలదూర్చలేరు. ఓ వైపు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి చేతులు ముడుచుకుని కూర్చోవాలి.

 

ఈ రకమైన నిర్బంధం నిజంగా కష్టమే. ఇక  నిమ్మగడ్డ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో ఎన్నికలు ఇప్పట్లో  నిర్వహించమని చెప్పారు కానీ ఎపుడు పెడతామన్నది మాత్రం చెప్పలేదు. అంటే ఆరు వారాల మాట కూడా ఇపుడు నిజం కానట్లుగా సీన్  కనిపిస్తోంది. ఓ విధంగా ఇపుడు ఏపీలో పాలన స్థంభించిపోయినట్లే. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి. అది ఎపుడు ఎత్తేస్తారో తెలియాలంటే ఎన్నికల సంగతి ముందు తేలాలి. అంటే ఇదో పెద్ద చిక్కుముడి వ్యవహారమే.

 

ఓ వైపు కరోనా వైరస్ భారత్ లో ఉంది. దాంతో ఏపీలో  అధికారులు మాత్రమే ప్రకటనలు ఇస్తున్నారు. వారే మాట్లాడుతున్నారు. మంత్రులు రాలేకపోతున్నారు. దీని మీద మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ పెట్టి తమ చేతులు కట్టేశారని వాపోయారు. ఇది ధర్మమేనా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. నిమ్మగడ్డకు ఇంకా చంద్రబాబే సీఎంగా కనిపిస్తున్నారులా ఉంది. ఏపీలో ప్రభుత్వం మారి పది నెలలు అయిందని కూడా అవంతి అంటున్నారు.

 

మొత్తానికి ఎన్నికల వాయిదా వేయడమే కాదు,  మంత్రులు, సీఎంలకు ఏ స్వేచ్చా లేకుండా ఎన్నికల కోడ్ ఉంచేశారని వైసీపీ నాయలుకు మండిపడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: