కరోనా వైరస్ విషయంలో చాలా ప్రభుత్వాలు మరియు స్వచ్ఛంద సంస్థలు అనేక జాగ్రత్తలు ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎక్కడ కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వీడియోలు చిత్రీకరిస్తూ ముందస్తు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ప్రభుత్వాలు ఈ వైరస్ విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించే విధంగా కాకుండా ఇతర దేశాల ప్రజలకు కూడా అన్ని జాగ్రత్తలు చెబుతున్నారు ఎవరికి వారు. ఈ విషయంలో స్వలాభం సొంత కథనం చూసుకోకుండా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఎక్కువగా మూఢనమ్మకాలు కలిగిన మన దేశంలో చాదస్తం ప్రజలు ఉన్న మన దేశంలో ఎటువంటి జాగ్రత్తలు పట్టించుకోవడం లేదని ఇటీవల బయటపడింది.

 

కేవలం చైనా దేశంలో ఉన్న ప్రజలు తిన్న ఆహారపు అలవాట్లు వల్ల నాన్న గడ్డి వల్ల వచ్చిందని ఎలాంటి రోగాలు భారతీయులకు రావని మన దేశ ప్రజలు ఈ వైరస్ విషయంలో అతిగా ప్రవర్తిస్తున్నారని వార్తలు బయటకు వచ్చాయి. దీంతో ముందుగానే సింగల్ కేస్ నమోదు కావడంతో దేశవ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండదు అని భావించారు. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ వైరస్ యొక్క ప్రభావం దాదాపు వందకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇష్టానుసారంగా సూచనలు మరియు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా తలబిరుసు తనంగా ఓవరాక్షన్ చేసే వాళ్లకి ఇది చెంపపెట్టులాంటిది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వైరస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా గగ్గోలు పెడుతోంది.

 

ప్రచార మాధ్యమాలు కూడా కరోనా వైరస్ జాగ్రత్తలు సూచించే విషయంలో అనేక యాడ్స్ వేస్తుంది. కాబట్టి వాటిని అన్నిటిని పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరూ దేశాన్ని కాపాడే విధంగా కరోనా వైరస్ విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదు అంటూ ప్రభుత్వాలు దండం పెడుతున్నాయి. ముఖ్యంగా అత్యంత జనాభా కలిగిన దేశం మన దేశం కాబట్టి ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కూడా తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: