అవును మీరు చదివింది నిజమే. ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిసో తెలీకో జగన్మోహన్ రెడ్డికి చాలా మేలు చేశాడనే చెప్పాలి. ఎలాగంటే గడచిన పది మాసాలుగా రమేష్ వ్యవహార శైలిపైన కానీ లేకపోతే ట్రాక్ రికార్డు గురించి కానీ జగన్ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మధ్యలో ఉండగా నిమ్మగడ్డ ఎన్నకలను వాయిదా వేయటంతో అందరి దృష్టి ఒక్కసారిగా నిమ్మగడ్డ వైపు మళ్ళింది.

 

నిజానికి ఎన్నికలను నిర్వహించక ముందే నిమ్మగడ్డను జగన్ మార్చేసుండాలి. కానీ ఆ పని చేయకుండానే ఎన్నికలకు ముందుకెళ్ళాడు జగన్. సరే దాని ఫలితం ఏమిటో ఇపుడు జగన్ కు బాగా తెలిసొచ్చింది. నిమ్మగడ్డను అడ్డం పెట్టుకుని చంద్రబాబునాయుడు ఎంత నీచస్ధాయికి దిగాడన్న విషయం ఇపుడు అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇక ముందు జగన్ మరింత జాగ్రత్తగా ఉంటాడనే అనుకోవాలి.

 

ఇక్కడ జగన్ కు నిమ్మగడ్డ చేసిన మేలేమిటంటే ప్రభుత్వ శాఖల్లో నిమ్మగడ్డ లాంటి చంద్రబాబు మద్దతుదారులు, నమ్మకస్తులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారనే విషయంలో జగన్ జాబితా రెడీ చేయిస్తున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన తొమ్మిది మాసాలకే జగన్ కు నిమ్మగడ్డ దెబ్బ తగలటం మంచిదైంది. ఇదే  వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు తగులుంటే ? చంద్రబాబు మద్దతుదారుల విషయంలో జగన్ జాగ్రత్త పడటానికి ఎన్నికల వాయిదా అంశం అలర్ట్ చేసినట్లైంది.  

 

వైసిపి అధికారంలోకి రాగానే  సతీష్ చంద్ర, ఏబి వెంకటేశ్వరరావు లాంటి అతికొద్దిమందికి పోస్టింగులు ఇవ్వకుండా కొంత కాలం జగన్ పక్కన పెట్టేశారు. అయితే తాజాగా నిమ్మగడ్డ దెబ్బకు ఏ ఏ శాఖల్లో చంద్రబాబు మనుషులు ఎవరెవరున్నారనే విషయంపై ఆరాలు మొదలైనట్లు సమాచారం. చంద్రబాబు హయాంలో సిఎంవోలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఓ అధికారి పంచాయితీ రాజ్ శాఖలో ఇపుడు చక్రం తిప్పుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ జాబితా రెడీ అవుతోందట. జాబితా రెడీ అయిన తర్వాత ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: