క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తప్పదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్ ను దెబ్బ కొట్టటానికి  చంద్రబాబునాయుడు చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్న విషయం మరోసారి తాజాగా బయటపడింది. ఎన్నికల కమీషన్ ప్రకటించిన స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదా ప్రకటన వెనుక చంద్రబాబు వ్యూహం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ విషయం మాట్లాడుకోవటానికి మాత్రమే పనికొస్తుంది కానీ వాదనల్లో ఎక్కడా నిలబడదు.

 

ఏదేమైనా ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అడ్డం పెట్టుకుని జగన్ ను చంద్రబాబు దారుణమైన దెబ్బ కొట్టిన విషయం అర్ధమైపోతోంది. అయితే ఈ దెబ్బతోనే జగన్ ను చంద్రబాబు వదిలేస్తాడా ? అంటే లేదనే సమాధానం వస్తోంది. ఎందుకంటే తాజాగా అంటే సోమవారం మధ్యాహ్నం నుండి చంద్రబాబు దగ్గర నుండి అందరు నేతలు కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు.

 

అదేమిటంటే ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలట. వేసిన నామినేషన్లన్నింటినీ రద్దు చేసి కేంద్ర ఎన్నికల కమీషన్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాల భద్రతతో మళ్ళీ ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాలంటూ డిమాండ్లు పెంచేస్తున్నారు. అంటే వాయిదా ముందు వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేయించటానికి చంద్రబాబు తెర వెనుక వ్యూహం రచిస్తున్నట్లే అనుమానంగా ఉంది. తన వ్యూహంలో భాగంగా టిడిపి వాళ్ళతోనే టిడిపిలో నామినేషన్లు వేయించే వారిపై దాడులు చేయించి వాటిని వీడియోలు తీయించారు.

 

దాడులు చేస్తున్న వీడియోలను ఇప్పటికే చంద్రబాబు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు రూపంలో అందించాడు. ఎలాగూ కొన్నిచోట్ల టిడిపి వాళ్ళతో నామినేషన్లు వేయనీయకుండా చేసిన ఓవర్ యాక్షన్ క్లిప్పింగులున్నాయి. వైసిపి నేతలు చేసిన గొడవలు, తమ వాళ్ళతో తమ వాళ్ళపై తామే చేయించిన గొడవల క్లిప్పింగులు అన్నీ కలిపి చివరకు ఎన్నికల రద్దుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కమీషన్ ఎన్నికలను రద్దు చేసినా జగన్మోహన్ రెడ్డి చేయగలిగేది కూడా ఏమీ లేదు. కోర్టుకు పోయినా జరిగిన గొడవల క్లిప్పింగులను చూసిన ఏ జడ్జి కూడా  కమీషన్ నిర్ణయాన్ని తప్పుపట్టడు. అదే జరిగితే జగన్ పరువు సాంతం పోయినట్లే ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: