చంద్రబాబునాయుడు కోటరీలో ముఖ్యనేత యనమల రామకృష్ణుడికి ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. అదే సమయంలో ప్రత్యర్ధులపై మైండ్ గేమ్ ఆడటంలో చంద్రబాబు తర్వాత స్ధానం యనమలదే. ఇపుడు అదే మైండ్ గేమ్ ను జగన్మోహన్ రెడ్డిపై యనమల ప్లే చేస్తున్నాడు.  కాకపోతే యనమల మాట్లాడిన మాటలు ఆయన అతి తెలివినే చూపిస్తున్నాయి.

 

ఇంతకీ యనమల ఏమన్నారంటే జగన్ సర్వ వ్యవస్ధలను భ్రష్టు పట్టిస్తున్నాడట. జగన్ లాంటి  మానసిక ఉన్మాదికి రాజ్యాన్ని పరిపాలించే అర్హత లేదని ఈయన తేల్చేశాడు. శాసన, అధికార, న్యాయవ్యవస్ధలను కూడా జగన్ భ్రష్టుపట్టించేశాడట.  నాలుగో వ్యవస్ధ అయిన మీడియాను కూడా కూడా జగన్ వదలేదట. చివరకు ఎన్నికల కమీషన్ ను కూడా జగన్ బెదిరిస్తున్నట్లు చెప్పేశాడు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తమలోని అవలక్షణాలను, తాము చేసే పనులన్నింటినీ టిడిపి జగన్ కు ఆపాదించేస్తోంది. వ్యవస్ధలను మ్యానేజ్ చేయటంలో చంద్రబాబు తర్వాతే ఇంకెవరైనా అన్న విషయం జనాలందరికీ తెలిసిందే. ప్రతి వ్యవస్ధలోను తన మద్దతుదారులను, అనుచరులను చొప్పించేసి అవసరానికి వాడేసుకోవటం చంద్రబాబుకే అలవాటు. చంద్రబాబు అవినీతిపైన వేసిన కేసుల్లో చాలా వరకూ కనీసం విచారణకు టేకప్ చేయకుండానే కోర్టులో కొట్టేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

 

ఇక అధికార వ్యవస్ధలో తన మద్దతుదారులను చొప్పించేసి ప్రత్యర్ధులను ఇబ్బంది పెడుతున్నాడనేందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. తాజాగా ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి కూడా శాసనవ్యవస్ధలో చంద్రబాబుకున్న పట్టునే చెబుతోంది. కరోనా వైరస్ పేరుతో ఎన్నికలను వాయిదా వేసే ముందు ఒక్కమాట ప్రభుత్వంతో మాట్లాడాలన్న కనీసపు ఆలోచన కూడా చేయలేదంటే నిమ్మగడ్డను ఏమనాలి ?  మొన్నటి ఎన్నికల్లో జనాలు తమ గూబ గుయ్యిమనిపించి వైసిపికి 151 సీట్ల మెజారిటి ఇవ్వటాన్ని టిడిపి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆ ఉక్రోషంలో నుండి వస్తున్నవే జగన్ పై ఆరోపణలు. మొత్తానికి యనమల చాలా అతి తెలివినే చూపించాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: