2019 ఎన్నికలు అయిన దగ్గర నుంచి చంద్రబాబుకు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఆయన పక్కనే ఉన్న నేతలందరూ వరుస పెట్టి వైసీపీ, బీజేపీల్లోకి వెళ్ళిపోయారు. చాలామంది బాబుకు హ్యాండ్ ఇచ్చేశారు. ఇక ఏదో రాక రాక 23 సీట్లు తెచ్చుకుని ప్రతిపక్ష హోదా తెచ్చుకున్నా, ఇప్పుడు అది కూడా పోయేలా కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీని ముగ్గురు ఎమ్మెల్యేలు వీడిన విషయం తెలిసిందే.

 

వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలు ముందే పార్టీని వీడి, ఎమ్మెల్యే పదవులు పోకుండా, టెక్నికల్‌గా వైసీపీలో చేరకుండా, జగన్‌కు జై కొట్టారు. ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఆపరేషన్‌లో భాగంగా టీడీపీ సీనియర్ నేత , చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా జగన్‌కు మద్ధతు తెలిపారు. ఇలా ముగ్గురు వెళ్లిపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 23కు చేరుకుంది. ఇక ఇలాగే ఇంకో నలుగురు ఎమ్మెల్యేలు జారిపోతే బాబుకు ప్రతిపక్ష హోదా పోవడం ఖాయం.

 

సాధారణంగా ప్రతిపక్ష హోదా ఉండాలంటే మొత్తం అసెంబ్లీ సీట్లలో పదోవ వంతు సీట్లు గెలవాలి. ఏపీలో 175 సీట్లకు గాను 17 సీట్లు గెలిస్తే ప్రతిపక్ష హోదా ఉంటుంది. ఇక టీడీపీకి 23 వచ్చాయి. ఇప్పుడు ముగ్గురు వెళ్ళిపోయారు కాబట్టి ఆ సంఖ్య 20కు చేరుకుంది. ఇక త్వరలోనే మరో నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లిపోతారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నలుగురు టీడీపీని వీడితే 16 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఆటోమేటిక్‌గా బాబు ప్రతిపక్ష నాయకుడు హోదా పోతుంది.

 

అయితే వైసీపీ ఆపరేషన్‌లో భాగంగా చిక్కుకున్న ఆ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రకాశం, విశాఖ జిల్లాల వారని తెలుస్తోంది. ప్రకాశంలో గొట్టిపాటి రవి, స్వామి, విశాఖలో గంటా శ్రీనివాస్, వాసుపల్లి గణేశ్‌లు బాబుకు హ్యాండ్ ఇచ్చేస్తారని ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి బాబుకు ప్రతిపక్ష హోదా ఉంటుందో? పోతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: