ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏపీలో కూడా ఒక కేసు నమోదు కావడంతో ముందు జాగ్రత్తగా అని ఏపీ ఎస్‌ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలని ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఎస్‌ఈసి ప్రకటన వెలువడిన గంటల్లోనే మమ్మలని సంప్రదించకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని, రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని చెబుతూ సీఎం జగన్‌తో సహ వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు.

 

అలాగే నిమ్మగడ్డది కూడా చంద్రబాబు సామాజికవర్గమేనని, ఆయన డైరక్షన్‌లోనే ఎన్నికలు వాయిదా వేశారని విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ కీలక నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ఇదే రకంగా విమర్శలు చేశారు. కరోనా వైరస్ వల్ల కాదు..కుల వైరస్ వల్లే స్థానిక ఎన్నికలు ఆపారంటూ అంబటి ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు వాయిదా వేయాలని ఉద్దేశ్యం ఉంటే..ఈ నిర్ణయం తీసుకుంటారా? అంటూ నిమ్మగడ్డపై విమర్శలు చేశారు.

 

అయితే ఈ విధంగా కులం పేరుతో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు తెలుగు తమ్ముళ్ళు కూడా కౌంటర్లు ఇచ్చారు. టీడీపీ నేతలతో సహ, సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు వైసీపీపై ఫైర్ అవుతున్నారు. అలాగే వైసీపీలో ఉన్న కమ్మ నాయకులు పేర్లు పెడుతూ, వారిని ఎందుకు పార్టీలో ఉంచుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, కరణం బలరాంలని పార్టీలో ఎలా చేర్చుకున్నారంటూ ఫైర్ అవుతున్నారు.

 

ఈ క్రమంలోనే కుల వైరస్ అంటూ మాట్లాడినా అంబటి వ్యాఖ్యలకు కూడా స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇస్తున్నారు. అంబటి పెద్ద కుమార్తె కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెబుతూ, కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని అల్లుడు ఎలా చేసుకున్నావ్ అంబటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఏపీలో కులాలు లేకుండా రాజకీయాలు నడవడం కష్టంలే.

మరింత సమాచారం తెలుసుకోండి: