కరోనా వైరస్ ప్రభావం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశామని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేసిన ప్రకటనపై సీఎం జగన్ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. తమని సంప్రదించకుండా, ఏపీలో కరోనా ప్రభావం లేకపోయిన, చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రమేశ్ కుమార్ ఎన్నికలు వాయిదా వేసారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల సంఘంపై గుర్రుగా ఉన్న జగన్, ఎన్నికల వాయిదాపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. సుప్రీంలో పిటిషన్ వేశారు.

 

అయితే ఇవేమన్నా వర్కౌట్ అయ్యి ఎన్నికలు వెంటనే జరిగితే ఓకే...అలా కాకుండా ఎన్నికల సంఘం చెప్పినట్లు ఎన్నికలు ఆరు వారాలు పాటు వాయిదా పడితే, జగన్ మరో పని చేయడానికి సిద్ధమవుతున్నారు. వెంటనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నారు. మామూలుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెల 29తో ముగియనున్నాయి. దీంతో ఈ నెల 28 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి, 30, 31 తేదీల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టాలని అనుకున్నారు.

 

కానీ ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడటంతో, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముందుకు జరపాలని వైసీపీ సర్కారు భావిస్తోంది. ఇక దీనిపై పూర్తిస్థాయిలో చర్చలు జరిపి, త్వరలోనే షెడ్యూల్ మార్పుతో పాటు, అసెంబ్లీ తేదీలు కూడా ఖరారు చేయనున్నారు. అయితే ఇదే సమావేశాలని అడ్డుగా పెట్టుకుని ప్రతిపక్ష టీడీపీని ఏకీపారేసేందుకు సీఎం జగన్ చూస్తున్నట్లు సమాచారం. మామూలుగా అయితే జగన్ పెద్దగా మీడియా సమావేశాలు పెట్టారు. ఏదో మొన్న ఎన్నికలు వాయిదా వేసిన నేపథ్యంలో మాత్రమే మాట్లాడారు.

 

జగన్ ఎక్కువగా ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేసేది అసెంబ్లీలోనే, గత అసెంబ్లీ సమావేశాల్లో జగన్, చంద్రబాబుకు అన్నిరకాలుగా చుక్కలు చూపించారు. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కావాలనే వాయిదా వేయించారనే నేపథ్యంలో బాబు అండ్ కో పై విరుచుకుపడటానికి జగన్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: