అదేంటి డెలీవరీ బాయ్ కు ఇంత డిమాండా.. ఒక్క రోజుకే 8000 జీతమా.. అంటే నెలకు రెండున్నర లక్షల రూపాయలా.. ఇదెక్కడ చోద్యం అనుకుంటున్నారా.. అవును మరి ఇది కరోనా తెచ్చి విచిత్రమైన పరిస్థితి. ఇంతకీ ఇదెక్కడో చెప్పలేదు కదా.. ఇది అమెరికాలో పరిస్థతి.

 

 

కరోనా వైరస్‌ ప్రభావంతో అమెరికా అల్లాడుతోంది. ఇప్పటికే 70 మంది వరకూ చనిపోయారు. వేల మంది దీని బారిన పడ్డారు. అందుకే కరోనా భయంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఆఫీసులు కూడా మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేందుకు వీలు కల్పించాయి.

 

 

ప్రతి సంక్షోభంలో అవకాశం ఉన్నట్టే.. ఇందులోనూ అవకాశం ఉంది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో ఆన్ లైన్ వ్యాపారానికి అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. వచ్చే ఆర్డర్లను కస్టమర్లను అందించేందుకు డెలీవరీ బాయ్ లు సరిపోడవడం లేదు. అందుకే అమెజాన్ సంస్థ సరికొత్త నిర్ణయం తీసుకుంది.

 

 

ఏకంగా లక్ష ఉద్యోగులను నియమించుకునేందుకు ప్లాన్ చేస్తోంది. గోడౌన్లు, డెలివరీ బాయ్ లు, షాప్‌ కీపర్లు ఈ మేరకు అవసరమని ఆ సంస్థ భావిస్తోంది. ఈ పరిస్థితి మిగిలిన వ్యాపారాల్లో పని చేసే వారికి వరంగా మారింది. ఎందుకంటే జనం బయటకు రాక వారికి ఉపాధి లేకుండా పోయింది. అందుకే వారు అమెజాన్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇలా వచ్చే వారికి గంటకు వెయ్యి రూపాయలు చెల్లించేందుకు అమెజాన్ ముందుకొస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: