కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ప్రపంచంలో ఏమూల విన్నా ఇదే వార్త.. టీవీ ఛానల్ పెట్టినా.. ఓ న్యూస్ పేపర్ తిరగేసినా.. ఏ సోషల్ మీడియా గ్రూపు చూసినా.. వాట్సప్ ఓపెన్ చేసినా.. ఇదే న్యూస్.. కరోనా రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి.. కరోనా వల్ల ఆ దేశంలో అంత మంది చచ్చిపోయారు.. కరోనా ఇప్పుడు మరిన్ని దేశాలకు వ్యాపించింది.. ఇదే న్యూస్.

 

 

ఈ న్యూస్ చూసి జనం కూడా పానిక్ అవుతున్నారు. దీనికి తగ్గట్లే ఇండియాలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకొటి ఉంది. క్రమంగా కరోనాను కట్టడి చేసే అవకాశాలు పెరుగుతున్నాయి. కరోనాకు కొన్ని మందులు కూడా పని చేస్తున్నాయి.

 

 

కరోనాను క్యూర్ చేసేందుకు వైద్యులు చేస్తున్న ప్రయోగాలు ఫలిస్తున్నాయి. కరోనాకు ఇంతకు ముందొచ్చిన వైరల్ వ్యాధులకు వాడిన మందుల కాంబినేషన్ ఫలిస్తోందట. గతంలో వచ్చిన మలేరియా, స్వైన్ ఫ్లూ, ఎయిడ్స్ లకు వాడిన మందులనే కాస్త కాంబినేషన్లు మార్చి వాడితే వ్యాధి అదుపులోకి వస్తోందట.

 

 

మందుల కాంబినేషన్ వాడిన రోగులు కొందరు కోలుకున్నారట. వారికి పరీక్షలు చేస్తే కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చిందట. అంటే కరోనా మందులతోనూ నయమవుతుంది. కాకపోతే.. కొత్త వైరస్ కాబట్టి దాన్ని అర్థం చేసుకుని కాస్త డోసేజ్ సెట్ చేసేందుకు ఆలస్యమవుతుందంతే. అందుకే కరోనా గురించి మరీ ఎక్కువగా భయపడకండి.. త్వరలోనే దీన్ని పూర్తిగా అరికట్టే వ్యాక్సీన్ కూడా రాబోతోందంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: