పెద్ద పెద్ద సిటీలలో నగరీకరణ ఎంతగా అభివృద్ది చెందిందో అంతకు మించి దొంగతనాలు, దోపీడిలు, నేరాలు ఘోరాలు కూడా బాగా పెరుగుతున్నాయి.. ఎక్కువగా పెద్ద నగరాల్లో ఇప్పుడు అదే జరుగుతూ వస్తుంది.. ప్రశాంతంగా ఉన్న సిటీలలో అంతకు మించిన రేంజులో దొంగతనాలు దొంగలు ప్రశాంతంగా చేసుకుంటూ పోతున్నారు.. ప్రశాంతంగా ఉన్న నగరాన్ని అల్ల కల్లోలం చేస్తున్నారు.. అందుకే ఇక్కడ జరిగే అన్నీ కూడా ఇక్కడ హైటెక్ రీతిలో జరుగుతున్నాయి.. 

 

 

 

వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లో దొంగలు వీరవిహారం చేస్తున్నారు..అదే ఇప్పుడు జరుగుతుంది.. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న కల్చర్ వల్ల వీదిలో ఒక వుంటుంది.. ఈ మేరకు విచ్చల విడిగా మద్యం సేవించి ఊగిపోతున్న సమయంలో ఓ ముఠా దొంగతనాలకు పాల్పడుతూ వస్తున్నారు.. మందుబాబులను టార్గెట్ చేసుకుని పబ్బులు.. రెస్టారెంట్లలో వెయిటర్లుగా పని చేస్తూ హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కేవలం పదో తరగతి చదువుకుని.. టెక్నాలజీ సాయంతో లక్షల రూపాయలు కొట్టేస్తున్న ఘరానా మోసగాడితో సహా ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

 

 

పబ్ లకు వచ్చిన పెద్ద పిల్లలకు మాయ మాటలు చెప్పి  ఏటీఎమ్ కార్డులను తీసుకొని పిన్ నంబర్ తెలుసుకొని వారి దగ్గర నుంచి వచ్చి పక్కకు వెళ్లి లక్షల డబ్బును లాగేసు కుంటు వస్తున్న ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు పట్టేసుకున్నారు... కార్డులను క్లోనింగ్ చేసి లక్షల రూపాయలు దోచుకుంటున్నారని.. గచ్చిబౌలి హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఒడిశాకు చెందిన ముగ్గురు నిందితులను చాకచక్యంగా అరెస్టు చేశారు. ఈ హైటెక్ దోపిడీ కేసు విచారణలో పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి.

 

 

ఒడిశాకి చెందిన ముఠా సభ్యులు ముందుగా పబ్బులు, రెస్టారెంట్‌లలో వెయిటర్లు గా పనిలో చేరి బిల్లింగ్ టైంలో స్వైపింగ్ చేస్తూ దారుణానికి ఒడిగట్టారు...అలా పెద్ద మొత్తంలో డబ్బులను స్వాహా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.. లక్షల్లో ఈ డబ్బులను తీసుకున్నట్లు సమాచారం.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి...

 

మరింత సమాచారం తెలుసుకోండి: