ఢిల్లీలో నడివీధుల్లో ఓ వ్యానులో ఓ అమ్మాయిపై పైశాచికంగా రేప్ చేసిన దుర్మార్గులు వాళ్లు.. ఆమే స్నేహితుడిని తీవ్రంగా గాయపరిచి.. సభ్య సమాజం తలదించుకునేలా ఆ యువతి మర్మాంగాల్లో రాడ్లు చొప్పించి మరీ పైశాచిక ఆనందం అనుభవించిన నర రూప రాక్షసులు వాళ్లు.. ఈ భూమి మీదు ఇంకొక్క క్షణం కూడా బతకడానికి వీళ్లేని వాళ్లు. కానీ వాళ్లు చట్టంతో ఆటలాడుకుంటున్నారు. ఓవైపు ఉరి సమయం దగ్గరపడటంతో కొత్త నాటకాలు ఆడుతున్నారు.

 

 

నిర్భయ దోషులు అక్షయ్‌ ఠాకూర్‌ , పవన్‌ గుప్తా , వినయ్‌ శర్మ , ముకేశ్‌సింగ్‌ కొత్త కొత్త కథలు వినిపిస్తూ భారత న్యాయ విధానాన్నే అపహాస్యం చేస్తున్నారు. ఉరి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక రకాలుగా పిటిషన్లు దాఖలు చేసి మూడు సార్లు ఉరి నుంచి తప్పించుకున్నారు. తొలిసారి ఈ ఏడాది జనవరి 22, ఫిబ్రవరి 1న రెండోసారి, మార్చి 2న మూడో సారి డెత్‌ వారెంట్లు జారీ అయ్యాయి.

 

 

కానీ దుర్మార్గులు పలు కారణాలతో కోర్టులకు వెళ్లి వాయిదా వేయించుకున్నారు. చివరకు ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానానకి కూడా వెళ్లారు. ఇప్పుడు మరో ప్లాన్ వేశారు. వీరిలో ఒకడైన ముకేశ్‌ సింగ్‌ మళ్లీ ఢిల్లీ కోర్టుకో ఓ పిటిషన్ వేశాడు. అసలు నిర్భయ అత్యాచార ఘటన జరిగిన డిసెంబరు 16న తాను ఢిల్లీలోనే లేనని ఆ పిటిషన్‌లో చెప్పుకొచ్చాడు. తనను రాజస్థాన్‌ నుంచి పోలీసులు ఢిల్లీకి తెచ్చారంటున్నాడు.

 

 

అంతేకాదు.. తీహార్ జైల్లో తనను చిత్రహింసలకు గురిచేశారంటున్నాడు. అందుకే తనకు మరణశిక్ష రద్దు చేయాలంటున్నాడు. మరి ఈ సారి కోర్టు ఏం చెబుతుందో.. చూడాలి.అందుకే ఇలాంటి వాళ్లకు హైదరాబాద్ పోలీసుల టైపులో ఎన్ కౌంటరే కరెక్టు అంటున్నారు నెటిజన్లు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: