స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదా వెనుక కుట్ర కోణం ఉందన్న విషయం బయటపడిపోయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఎన్నికల నిర్వహణ విషయమై రాసిన లేఖకు నిమ్మగడ్డ మంగళవారం జవాబు రాసిన విషయం తెలిసింది. నిమ్మగడ్డ రాసిన లేఖలో తన తప్పులను తానే అంగీకరించిన విషయం స్పష్టంగా తెలిసిపోతోంది.  జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో లేవనెత్తిన ప్రశ్నలకు నిమ్మగడ్డ ఎటువంటి సమాధానం చెప్పలేకపోయారు. దాంతో నిమ్మగడ్డ  సెల్ఫ్ గోల్  వేసుకున్న విషయం అర్ధమైపోతోంది.

 

మూడు పేజీల లేఖలో మాట్లాడుతూ ఎన్నికల వాయిదాకు కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సూచనలే కారణమని చెప్పారు. ఇది ఎంత అసబద్దమో అర్ధమైపోతోంది. రాష్ట్రంలో ఎన్నికల వాయిదాకు కేంద్రం ఆరోగ్య శాఖ నుండి సూచనలు తీసుకోవటం ఏమిటి ? రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత గురించి తెలుసుకోవాల్సింది రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో అన్న విషయం నిమ్మగడ్డకు తెలీదా ? పైగా  తాను సమాచారం కావాలని కోరితే వైద్య శాఖ అధికారులు స్పందించలేదని ఆరోపించారు. ఇది కూడా అబద్ధమని తేలిపోయింది. ఎందుకంటే ఆరోగ్య శాఖ అధికారులు స్పందిచకపోతే అదే విషయాన్ని ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేయాలి. ఆ పనిచేశారా ?

 

అలాగే కరొనా తీవ్రత గురించి ప్రపంచ ఆరోగ్య శాఖ హెచ్చరికలను ఉదహరించారు. ప్రపంచ దేశాల్లో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది కాబట్టి ప్రపంచం మొత్తానికి ప్రపంచ ఆరోగ్య శాఖ హెచ్చరిక చేయటం సహజమే. అంతేకానీ దాన్ని మనదేశానికి పైగా మన రాష్ట్రానికి ఎలా అన్వయించుకుంటాడు ?  మనదేశంలో ఇపుడిపుడు కేసులు బయటపడుతున్నా మన రాష్ట్రంలో మాత్రం లేదనే చెప్పాలి.

 

ఇక పశ్చిమబెంగాల్, రాజస్ధాన్ లాంటి రాష్ట్రాల్లో కూడా స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేసుకున్నట్లు చెప్పాడు. అయితే పశ్చిమబెంగాల్లో  అన్నీ రాజకీయ పార్టీలతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వమే స్వయంగా ఎన్నికలను వాయిదా వేయాలని కోరింది. ఆ విషయాన్ని నిమ్మగడ్డ ఉద్దేశ్యపూర్వకంగానే దాచిపెట్టాడు. ఏపిలో ఎన్నికలను వాయిదా వేయాలన్న ఆలోచన నిమ్మగడ్డ మాత్రమే తీసుకున్నాడు. కనీసం కమీషన్ లో పనిచేసే మిగిలిన ఉన్నతాధికారులకు కూడా తెలీకుండా జాగ్రత్త పడిన విషయం అందరికీ తెలుసు. కాబట్టి తాను రాసిన లేఖలో నిమ్మగడ్డ వేసుకున్న సెల్ఫ్ గోల్ అర్ధమైపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: