దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 137 మంది కరోనా భారీన పడగా వీరిలో ముగ్గురు మృతి చెందారు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 90 శాతం ఇరాన్ లో నమోదవుతున్నాయి. 
 
ఇరాన్ లో 16,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో 988 మంది చనిపోయారు. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ప్రజలు కరోనా భారీన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆరోగ్య సూచనలు విధిగా పాటించాలని, అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించింది. 
 
ఇరాన్ లోని షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ దేశంలో కరోనా మరణాలపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో దేశంలో మూడు పరిస్థితులను నిపుణులు అంచనా వేశారు. దేశ పౌరులు పూర్తిగా సహకరిస్తే 1,20,000 మందికి కరోనా సోకే అవకాశం ఉందని 12,000 ఉంది చనిపోతారని అధ్యయనం చెబుతోంది. పౌరులు సాధారణ స్థితిలో సహకరిస్తే 3,00,000 మంది కరోనా భారీన పడే అవకాశం ఉందని 1,10,000 మంది చనిపోతారని పేర్కొంది. 
 
పౌరులు సహకరించకపోతే మాత్రం 40 లక్షల మంది కరోనా భారీన పడే అవకాశం ఉందని... 35 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని సర్వే తెలిపింది. ఆగస్ట్ వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉండవచ్చని తెలుస్తోంది. అమెరికాలో 4,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 85 మంది చనిపోయారు. పాక్ లో నిన్నటివరకు 155 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా నిన్న తొలి మరణం నమోదైంది.      

మరింత సమాచారం తెలుసుకోండి: