మానవ ప్రమేయంతో ఏదో ప్రయోగం చేస్తుండగా పుట్టిన రాక్షసుడు కరోనా.. ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రతి వారిలో వణుకు మొదలవుతుంది.. ప్రపంచానికే కొరకరాని కొయ్యలా మారిన ఈ రక్త పిశాచి తన జడలు విప్పుకుని విచ్చలవిడిగా సంచరిస్తుంది.. దీని దాటికి లోకంలో ప్రజలందరు మండేవేసవిలో పక్షులు అలమటించినట్లుగా అలమటిస్తున్నారు.. ఇంకా మందు కూడా తయరవని ఈ వైరస్ బారినుండి ప్రాణాలు రక్షించుకోవాలని తపించిపోతున్నారు.. ఇలాంటి పరిస్దితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. వాటిలో భాగంగా ప్రస్తుతం ప్లాన్‌–బీ అమలు చేస్తుంది..

 

 

అదేమంటే రద్దీ అధికంగా ఉండే విద్యా సంస్థలు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, బార్లు, జిమ్‌లు తదితరాలను మూసివేయమని ఆదేశించింది. ఇలా కూడా కరోనా కంట్రోల్ కాకుంటే.. అవసరమైతే ప్లాన్‌–సీని కూడ అమలు చేయడానికి సిద్దపడుతుంది.. ఇదెలా ఉంది అంటే తప్పని పరిస్దితుల్లో కర్ఫ్యూ విధించడం లాంటి తరహా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది... ఇకపోతే నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఎన్‌డీఎంఏ)–2005 ప్రకారం.. కరోనా విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న  ప్రభుత్వం.. ఓవైపు నివారణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వదంతులు, పుకార్లపైనా దృష్టి సారించాలని పోలీసుశాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది..

 

 

ఇక ఇలాంటి వాటిని అరికట్టే విషయంలో ఎన్‌డీఎంఏ–2005 (సెక్షన్‌ 54) చట్టం వీలు కల్పిస్తుంది. 2005లో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో పలు విపత్తులు సంభవించినా.. వదంతులు పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. కానీ, సోషల్‌ మీడియా, ఉచిత డేటా అందుబాటులోకి వచ్చాక.. స్మార్ట్‌ ఫోన్ల సాయంతో కొందరు వదంతులను ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో ఆందోళనలను పెంచుతున్నారు. అందువల్ల ప్రస్తుతం కోవిడ్‌ వ్యాధి విచ్చలవిడిగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సోషల్‌ మీడియాల్లో వదంతులు ప్రచారం చేసేవారిపై రాష్ట్ర పోలీసులు నిఘా పెట్టారు...

 

 

కొందరు పోకిరిలు, మరి కొందరు విషయ పరిజ్ఞానం లేని వారు ప్రజల్లో భయాందోళనలు కలిగించే తప్పుడు పోస్టులను షేర్‌ చేస్తుంటారు. ఇలాంటి వారు ప్రస్తుతం నెలకొంటున్న పరిస్దితుల్లో ఒళ్లు దగ్గరపెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని, లేదంటే లేనిపోని సమస్యలను చట్టపరంగా ఎదుర్కొనవలసి వస్తుందని పేర్కొంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: