చంద్రబాబునాయుడు, ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దృష్టిలో కరోనా వైరస్ చాలా ప్రమాదకర స్ధాయిలో ఉంది.  కాబట్టి వాళ్ళకు మద్దతుగా  పచ్చపత్రికలు కూడా కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని కథనాలు వండి వారుస్తున్నాయి. ఇందులో భాగంగానే రెండు పత్రికలు కరోనా వైరస్ కు సంబంధించిన ఎకడెక్కడి కథనాలు, వార్తలను  మొదటి పేజిలో బ్యానర్ గా ప్రచురిస్తున్నాయి. విచిత్రమేమిటంటే కరోనా నెగిటివ్ కేసులను కూడా కరోనా వైరస్ సోకిందన్నంత ప్రముఖంగా ప్రచురించటమే. చంద్రబాబు, నిమ్మగడ్డ మాట్లాడిన తర్వాత పచ్చమీడియా కూడా కరోనా పై తీవ్రత పెంచేసింది.

 

అంటే స్దానిక సంస్ధల ఎన్నికల వాయిదా చంద్రబాబు పట్టుబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు కోరిక మేరకే నిమ్మగడ్డ కూడా లేని తీవ్రతను ఉందని చెప్పి ఎన్నికలను హఠాత్తుగా వాయిదా వేశారు. అయితే ఎన్నికల వాయిదా వెనుక చంద్రబాబు, నిమ్మగడ్డ కుట్ర చేశారంటూ జగన్మోహన్ రెడ్డి బాహాటంగానే ఆరోపణలు చేశాడు. దాంతో రాజకీయ వేడి ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందనే వాదనను పచ్చమీడియా భుజానేసుకుంది.

 

ఇందులో భాగంగానే  లేని తీవ్రత చాలా ఎక్కువగా ఉందని వాదిస్తు కరోనా వైరస్ కథనాలను ప్రముఖంగా పచ్చపత్రిక అచ్చేస్తోంది. పైగా కరోనా వైరస్ ఉందని అంగీకరిస్తే ప్రభుత్వానికి అహం దెబ్బ తింటుదనే ఒప్పుకోవటం లేదని ఆరోపణలు గుప్పించింది. కరోనా వైరస్ తీవ్రతకు జగన్ అహంకారానికి ఏమిటి సంబంధం ? వైరస్ సోకిన మనుషులను డాక్టర్లు గుర్తించిన తర్వాత కూడా జగన్ కాదనగలడా ?

 

వైరస్ తీవ్రత ఏపిలో లేదని జగన్ అన్నది వాస్తవమే. ఎందుకన్నాడంటే తీవ్రత లేదు కాబట్టి అలాగే జనాలు ఆందోళనలకు గురి కాకూడదనే. పైగా కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు జనాలకు చెబుతునే ఉంది కదా ? ఇక నిర్లక్ష్యం చేసిందెక్కడ ? రాష్ట్రంలో అనుమానితుల సంఖ్య పెరుగుతోందని పచ్చమీడియా ప్రముఖంగా అచ్చేస్తోంది. అనుమానితులంటే కరోనా ఉన్నట్లు కాదన్న విషయం తెలిసీ జగన్ ను గబ్బు పట్టించటమే టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: