కరోనా..కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎటు చూసినా కరోనా జపమే.. చివరకు సామాజిక మాధ్యమాల్లోనూ కరోనా జపమే..అలాంటి ఓ కరోనా పేరడీ మీ కోసం..

 

ఆగాగు..క‌రోనాచార్యదేవా!

అహ్హహ్హా.. ఏమంటివి? ఏమంటివి ?

వైర‌స్‌ నెపమున మ‌నిషి మ‌నుగ‌డ‌కింత నిలువ‌ నీడ లేదందువా?

ఎంత మాట? ఎంత మాట?

నీది ఉత్త వైరస్ యేగానీ బయబడిపోయే అంతా వైరస్ కాదే ?

కాదు.. కాకూడదు.

 

ఇది మ‌ర‌ణ‌ కరోనా వైరస్ అందువా?

ఎబోలా వైర‌స్ జ‌న‌న‌మెట్టిది?

అతి జుగుప్సాకరమైన నిఫా వైర‌స్ సంభ‌వ‌మెట్టిది?

మట్టిలో క‌లిసెను క‌దా?

అహ్హ‌హహా.. అది కాదా మా సత్తా !

 

 

ఇంతయేల.. ప్రపంచ‌మంతా వ్యాపించి.. వ‌ణికించి.. క‌బ‌ళించి.. క‌కావిక‌లం చేస్తున్న మ‌హ‌మ్మారిల‌ను మేం త‌రిమేయ‌లేదా ? అంతెందుకు

మాన‌వాళి భ‌విష్య‌త్‌ను అంధ‌కారం చేసి.. స‌క‌ల ఖండాల‌ను చుట్ట‌బెట్టి..

కోట్లాది ప్రాణాల‌ను హ‌రించి మేం పున‌ర్ జ‌నించ‌లేదా?

 

నాతో చెప్పింతువేమయ్యా.. మా వంశమునకు మూలపురుషులైన ఆదిమాన‌వులు మ‌హ‌మ్మారిని త‌ట్టుకోలేదా? అంత‌కంత‌కూ వ్యాపిస్తూ ఆందోళ‌న క‌లిగించిన అంటువ్యాధిని..

ఆ వ్యాధిని అంటిపెట్టుకొని తిరిగిన క‌ల‌రాను..

దానిని దాటేసుకుంటూ వ‌చ్చిన మ‌శూచిని..

ఆ వ్యాధికి తోడుగా వ‌చ్చిన ప్లేగును..

ఆ త‌ర్వాత వ‌చ్చిన హెచ్ఐవీని..

దానికంటే డేంజ‌రైన క్యాన్స‌ర్‌ను..

ఆ పిద‌ప వ‌చ్చిన సార్స్‌ను..

అంత‌టితో ఆగ‌కుండా

దూసుకొచ్చిన స్వైన్‌ఫ్లూను..

ఆవుల నుంచి వ‌చ్చిన క్షయ‌ను..

బాతుల నుంచి వ‌చ్చిన ఫ్లూను..

మా ఇండ్లలో అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి పిల‌గాండ్లను ప‌ల‌క‌రించే ఆట‌ల‌మ్మను..

అంత‌కంత‌కూ త‌ట్టకుని బ‌తికి బ‌ట్టక‌ట్టలేదా?

 

సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాధాన్యములతో సంకరమైన ఈ వైర‌స్ వంశ‌ము ఏ నాడో మా చేతుల కుక్క చావు చ‌చ్చిన‌ది.

 

కాగా ,,,,నేడు ,,,,క‌రోనా.. క‌రోనా అను వ్యర్థ వాద‌ములెందుకు.. ??

నువ్వు కూడా అటులనే చచ్చేద,,,,,,, కానీ

ఈ మానవ మనుగడ ఎప్పటికీ ,,,, ఎప్పటికీ శాశ్వతంగా నిలేచేదా,,,,,,,,!

 

మరింత సమాచారం తెలుసుకోండి: