ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా గురించే చర్చ నడుస్తోంది. అయితే ఈ కరోనా చాలా మంది మీద ఈ వ్యాధి తేలికపాటి ప్రభావమే చూపుతోంది. కానీ కొంత మంది ప్రాణాలను మాత్రం హరిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోంది.. అసలు ఈ వైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తోంది? కొంత మంది ఎందుకు చనిపోతున్నారు? దీనికి చికిత్స చేయటం ఎలా? తెలుసుకుందాం..

 

 

కరోనా వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అంటే ఈ వైరస్‌ను శ్వాసలోకి పీల్చినపుడు.. లేదా ఇది సోకిన వారు ఎవరైనా మనకు దగ్గరగా ఉండి దగ్గినపుడు లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు ఇది మన శరీరంలోకి చొరబడుతుంది. ఇది మొదట మన గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి ఇది వ్యాపిస్తుంది.

 

 

అలా వ్యాపించడమే ఆలస్యం.. వాటిని 'కరోనా వైరస్ కర్మాగారాలు'గా మార్చేస్తుంది. అంటే.. అక్కడ వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి నుంచి ఉప్పెనలా మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది. ఇది ప్రాధమిక దశ. ఈ దశలో మనం జబ్బుపడం. అసలు కొంతమందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. వైరస్ తొలుత సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనిపించే వరకూ పట్టే కాలం - ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే.. ఈ కాలం సగటున ఐదు రోజులుగా ఉంది.

 

 

కరోనా దాడి చేసినప్పుడు ఊపిరితిత్తులు నీటితో నిండిపోవటం మొదలవుతుంది. దీనిఫలితంగా శ్వాస తీసుకోవటం ఇబ్బందికరంగా మారుతూ వస్తుంది. చివరికి చాలా కష్టమవుతుంది. కొంతమందికి శ్వాస అందించటానికి వెంటిలేటర్ అవసరమవుతుంది. చైనా నుంచి అందిన సమాచారం ఆధారంగా చూస్తే.. కరోనావైరస్ సోకిన వారిలో సుమారు 14 శాతం మంది ఈ దశకు చేరుతున్నట్లు భావిస్తున్నారు. మొత్తం మీద ఆరు శాతం కేసుల్లో విషమంగా జబ్బుపడుతున్నట్లు అంచనా. ఈ దశకు వచ్చేసరికి.. శరీరం విఫలమవటం మొదలవుతుంది. మరణం సంభవించే అవకాశం అధికం. ఇలా కరోనా వైరస్ మనుషులను చంపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: