ప్రస్తుతం ప్రపంచ దేశాల ప్రజలందరి ప్రాణ భయంతో వణికిస్తు .. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న మహమ్మారి ప్రాణాంతకమైన వైరస్ కరోనా . చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది... ప్రపంచ దేశాల ప్రజలను చిగురుటాకులా వణికిస్తోంది . ముఖ్యంగా పలు దేశాల్లో అయితే ఈ మహమ్మారి బారిన పడి విలవిలలాడుతున్నాయి. ఇక చైనా దేశం తర్వాత ఇటలీ,  ఉత్తర కొరియా లాంటి దేశాల్లో ఈ వైరస్ మరింతగా విజృంభిస్తోంది.

 

 

 

చైనాలో కంటే ఎక్కువ మొత్తంలో ప్రస్తుతం ఇటలీ  దేశంలో మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే కరోనా విజృంభణ పై లండన్ ఇంపీరియల్ కాలేజ్ జీవ గణితం ప్రొఫెసర్ నీల్ పెర్గుసన్  నేతృత్వంలో ఓ బృందం చేపట్టిన అధ్యయనం... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ... ప్రజలందరినీ ప్రాణభయంతో వణికిస్తున్న కరోనా వైరస్ ఏ స్థాయిలో మానవాళిని కబళిస్తోంది అనే విషయం కళ్లకు కట్టినట్లుగా తెలిపింది. 

 

 

 ప్రస్తుతం చైనా తర్వాత కరోనా  ప్రభావం ఎక్కువగా ఉన్నా ఇటలీలోని వివరాలను సేకరించి ఈ అధ్యయనం చేపట్టారు. కాగా  కరోనా  వైరస్ వల్ల రాబోయే కాలంలో ప్రపంచ దేశాలు ఎదుర్కొనే పరిణామాలను ఈ అధ్యయనం అంచనా వేసింది. అయితే 1918లో వ్యాపించిన ఫ్లూతో కరోనా వైరస్ను పోలుస్తూ ఈ అధ్యయనం నిర్వహించగా ప్రస్తుతం కరోనా  వైరస్ ను  కట్టడి చేసేందుకు విరుగుడు లేకపోవడంతో... అమెరికాలో ఏకంగా 22 లక్షల మంది... బ్రిటన్లో ఐదు లక్షల మంది ఈ వైరస్ బారిన పడి.. ప్రాణాలు కోల్పోతారు అనే సంచలన నిజాలు ఈ అధ్యయనంలో వెల్లడయ్యాయి. 

 

 

 అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వైరస్ ను నియంత్రించడానికి... కరోనా  వైరస్ అనుమానిత కేసులను ఇంటివద్దే ఒంటరిగా ఉంచడం లాంటి చర్యలు కాస్త సత్ఫలితాలను ఇచ్చినప్పటికీ... ముందస్తుగా జనజీవనం పై ఎలాంటి ఆంక్షలు విధించకపోడంతో ఏకంగా 2 లక్షల 50 వేల మంది ఈ కరుణ వైరస్ బారిన పడి మరణిస్తారని అధ్యయనంలో వెల్లడయింది.

 

 

 

ప్రస్తుతం సినిమా థియేటర్లు పార్కులు షాపింగ్ మాల్స్ విద్యాసంస్థలు పబ్ లు  మూసివేయడం ద్వారా.. ప్రజల మధ్య కాస్త దూరం పెరిగి  ఈ కరోనా  వైరస్ నియంత్రించే అవకాశాలు ఉన్నాయి అంటూ తెలిపింది అధ్యయన సంస్థ. అయితే ఈ కరోనా వైరస్ వల్ల తీసుకుంటున్న చర్యలు సామాజికంగా ఆర్థికంగా కూడా ప్రజల పై భారీ వత్తిడిని కలిగిస్తాయి అంటూ పెర్గుసన్  తో కలిసి అధ్యయనం ఎపిడమాలజి ప్రెఫెసర్ అజ్రా ఘనీ చెప్పుకొచ్చారు.  ఇక ఈ అధ్యయనం బట్టి చూస్తే భవిష్యత్తు కాలంలో కరోనా  వైరస్ వ్యాప్తి తో  వచ్చే గడ్డు కాలాన్ని ముందుగానే అంచనా వేశారు అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: