చైనాలోని పుహాన్ లో మొదలైన కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు  ప్రపంచవ్యాప్తంగా 163 దేశాల్లో విస్తరించిన కరోనా వైరస్ ప్రమాద ఘంటికలను మోగిస్తున్న వేళ, ఇండియాలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 142 ఉన్నాయని అధికారిక ప్రకటన విడుదలైంది. ఇప్పుడు మానవాళికి మొత్తం ఉమ్మడి శత్రువు కరోనా వైరస్ ఒక్కటే...  అన్ని దేశాలు ఈ మహమ్మారి జపం చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది.  మనిషి ఎంత డబ్బు సంపాదించినా తన ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.  తాజాగా మహారాష్ట్రపై వైరస్ ప్రభావం అత్యధికంగా ఉండగా, ఈ రాష్ట్రంలో ఇప్పటివరకూ 39 కేసులు నమోదయ్యాయి.

 

ఆపై రెండో స్థానంలో తొలి కేసు వెలుగుచూసిన కేరళ నిలిచింది. కేరళలో 26 కేసులు నమోదయ్యాయి.  ఉత్తరప్రదేశ్ లో 15, హర్యానాలో 15, కర్ణాటకలో 11, ఢిల్లీలో 8, లడఖ్ లో 6, తెలంగాణలో 5, రాజస్థాన్ లో 4, జమ్ము కశ్మీర్ లో 3 కేసులున్నాయని, ఉత్తరాఖండ్, పంజాబ్, ఒడిశా, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.  ఇక కరోనా ఎఫెక్ట్ హైదరాబాద్ లో కూడా బాగానే చూపిస్తుంది. కరోనా వైరస్ భయంతో హైదరాబాద్, అమీర్‌పేటలోని కోచింగ్ సెంటర్లు మూతపడనున్నాయి.

 

వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే స్కూళ్లను మూసివేసిన ప్రభుత్వం ఇప్పుడు మైత్రీవనంలో వందలాదిగా ఉన్న కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లను మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది.అలాగే, హాస్టళ్లను మూసివేసి విద్యార్థులను వారి స్వగ్రామాలకు పంపాల్సిందిగా అధికారులు సూచించారు. ఉత్తర్వులను ఉల్లంఘించి శిక్షణ సంస్థలను తెరిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఇక ఇప్పటి వరకు   కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 7,965కు చేరగా, 1,98,178 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతున్న వారిలో 7,020 మంది పరిస్థితి విషమంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: