ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం కోడి గుడ్డు, చికెన్‌ తినడం వలన కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. దీనివలన కోడి మాంసం, కోడి గుడ్లు వ్యాపారం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఇన్ని నెలలుగా రూ. 4.50 గా విక్రియిస్తున్న కోడి గుడ్డు ధర ఇప్పుడు రూ. 1.౩౦ ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కోడి మాంసం రూ. 80 నుంచి రూ. 20కి తగ్గిందన్నారు. అయితే.. మంగళవారం తమిళనాడు గుడ్ల కోళ్ల సమ్మేళం సమావేశం నిర్వహించి కోడి గుడ్డు, కోడి మాంసం తినటం వలన కరోనా వ్యాప్తి చెందుతుందని ఎవరైనా నిరూపిస్తే.. రూ.కోటి బహుమతిని అందజేస్తామని గుడ్ల కోళ్ల సమ్మేళం అధ్యక్షుడు ముత్తుస్వామి తెలిపారు. మాంసం, కోళ్లు, కోడిగుడ్లకు ప్రసిద్ధి చెందిన నామక్కల్‌ జిల్లాలో కోళ్ల ఫారాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కుంటున్నాయన్నారు. దీనికి కారణం టీవీలలో, సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వదంతులే కారణమని ఆయన పేర్కొన్నారు. ఇందులో కోళ్ల ఫారం యజమానులే కాకుండా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.

 

కోళ్ల దానా ఇదివరకు రూ. 20 అమ్మిన ఇప్పుడు రూ. 16 కు అమ్ముతున్నారు. అయినా కూడా కొనుగోలు చేసే వారు కూడా కరువయ్యారని వారు వాపోతున్నారు. నామక్కల్‌ మండలంలో 15 కోట్ల గుడ్లు నిలిచిపోయాయని దీనికి తోడు పాఠశాలల సెలవులు ఇవ్వడంతో  అదనంగా మరో 4 కోట్ల గుడ్లు నిలిచిపోయాయని వారు తెలిపారు. ఈ కోడిగుడ్లను శీతలీకరణ పెట్టెల్లో పెట్టి ధర పెరిగిన తర్వాత అమ్మవచ్చునని ఆలోచిస్తున్నామన్నారు. 

 

అమెరికా, చైనా, ఇటలీ వంటి దేశాల్లో కూడా కోడి మాంసం, కోడి గుడ్లను ఆహారంగా తీసుకుంటున్నారు. అన్ని.. వారికి కోడి మాంసం, గుడ్లు తినటం వలన ఎలాంటి నష్టం జరగలేదు. మీడియా వదంతులను నమ్మకుండా అన్ని ఆహారంలో భాగంగా తీసుకోవాలని వారు తెలిపారు. కరోనా వదంతుల వల్లే ఇప్పటి వరకు పౌల్ట్రీకి రూ. 500 కోట్లు నష్టం వాటిల్లిందని వారు పేర్కొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: