గతవారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కరోనా వైరస్‌ ను అమెరికా సైన్యమే తీసుకొచ్చిందని ఆరోపణలు చేశారు. వైరస్ ప్రభావితం చేసింది అమెరికా అని, ఇలాంటి నిందలు చైనా అమెరికా మీద వేయటానికి ప్రయత్నిస్తుంటే ఇలాంటి ఆరోపణలను అమెరికా తిప్పికోట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ ను ‘చైనీస్‌ వైరస్‌’గా అభివర్ణించారు. తాజాగా మరోసారి వైరస్ విషయమై చైనా, అమెరికాలు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ‘కరోనా’ విజృంభించడానికి అమెరికా కారణమని చైనా నిందలు వేస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో విరుచుకుపడ్డారు. 


దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి తీవ్రంగా స్పందించి.. ఈ వైరస్‌ ను అమెరికా సైన్యమే చైనాకు తీసుకొచ్చి ఉండవచ్చని ఆయన ఆరోపించారు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) చైనా దేశంలో కంటే ప్రపంచంలోని మిగతా దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువ అని ప్రకటించింది అప్పటి నుంచి అమెరికా- చైనాలు పరస్పరం విమర్శలకు దిగాయి. 


గత ఫిబ్రవరి నెలలో వాల్‌ స్ట్రీట్ జర్నల్‌‌కు చెందిన ముగ్గురు జర్నలిస్టులు వారిలో ఇద్దరు అమెరికన్లు, ఒకరు ఆస్ట్రేలియన్‌ ను చైనా తమ దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా మూడు అమెరికా దినపత్రికలకు సంబంధించిన జర్నలిస్టుల గుర్తింపును మంగళవారం చైనా రద్దుచేసింది. అలానే వాల్‌ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్‌లకు చెందిన అమెరికా జర్నలిస్ట్‌ గుర్తింపు రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది చైనా. అయితే.. కరోనా వైరస్ వ్యాప్తి పై వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది.  ‘రియల్ సిక్ మ్యాన్ ఆఫ్ ఆసియా’గా పేర్కొంటూ ఒపీనియన్ కాలమ్ రాయడంతోనే చైనా ఈ నిర్ణయం తీసుకుంది. 


దీనికి గాను క్షమాపణ చెప్పాలని చైనా డిమాండ్ చేసినా, వాల్‌ స్ట్రీట్ జర్నల్ అందుకు అంగీకరించలేదు. దీంతో ఆ పత్రికకు సంబంధించిన ముగ్గురు జర్నలిస్ట్‌లను గెంటేసింది. అమెరికా జర్నలిస్ట్‌ల గుర్తింపు ఇప్పటికే ముగిసిందని, అందుకే తమ దేశంతోపాటు హాంకాంగ్, మకావులో విధులు నిర్వహించడానికి అనుమతించడంలేదని స్పష్టం చేసింది. అలాగే వారి గుర్తింపు కార్డులను పది రోజుల్లోగా వెనక్కు ఇవ్వాలని ఆదేశించింది. 
  

 

మరింత సమాచారం తెలుసుకోండి: