విచక్షణాధికారం.. ఈమధ్య బాగా వినిపిస్తున్న పదం ఇది. మొన్న కౌన్సిల్ లో మూడు రాజధానుల బిల్లు ఈ విచక్షణాధికారం కారణంగానే ఆగిపోయింది. ఆ తర్వాత స్థానిక ఎన్నికలు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విచక్షణాధికారం కారణంగానే వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు ఏపీలో మంత్రులు కూడా ఇదే అంశంపై ఫైర్ అవుతున్నారు.

 

 

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఈసీకి విచక్షణాధికారాలు ఎలా ఉంటాయో.. అట్లాగే తమకూ విచక్షణాధికారులు ఉంటాయంటున్నారు. అందుకే ఇరిగేషన్‌ అధికారులను పిలిచి మాట్లాడడం జరిగింది. మా విచక్షణతో పనిచేసుకుంటూ వెళ్తాం అని తేల్చి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా శివారు భూములకు తాగునీరు అందడం లేదని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. తగు ఆదేశాలు ఇవ్వాలో.. లేదో పరిస్థితి క్రియేట్‌ చేశారని మండిపడ్డారు.

 

 

వ్యవసాయ శాఖ అనేది చాలా కీలకం.. విత్తనాలు సేకరించాలి. రైతు భరోసా కేంద్రాలు 20 కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసినప్పుడు వైరస్‌ వ్యాప్తి, నియంత్రణ గురించి ఎన్నికల కమిషనర్‌ ఏమైనా సమీక్ష చేస్తున్నారా..? సీఎం వైయస్‌ జగన్‌ ‘స్పందన’ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. కోడ్‌ వల్ల స్పందనను కూడా ఆపేయాలని ఆదేశాలిచ్చారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా..? ప్రజల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి. కోడ్‌ను బూచీగా చూపించి పరిపాలనను స్తంభింపజేస్తారా..? అని ప్రశ్నించారు.

 

 

కన్నబాబు ఇంకా ఏమన్నారంటే.. " ఈసీ చేసింది తప్పు. ఏ ఒక్క ముఖ్య అధికారిని, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోలేకపోయారా..? సీఎస్‌కు రాసిన లేఖలో హైకోర్టు న్యాయమూర్తికి ఉండే హక్కులు ఉంటాయని ఎన్నికల కమిషనర్‌ రాశారు. ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని తెలియదా..? కరోనా వైరస్‌ను అడ్డుపెట్టుకొని ఎన్నికలు ఆపుతారా..? అని ప్రశ్నించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: