కరోనా  వైరస్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్నది . ఇక ఈ వైరస్ వెలుగులోకి వచ్చి ఇప్పటికే నెలలు గడిచి పోతున్నప్పటికీ ఇప్పటివరకు సరైన విరుగుడు  మాత్రం ఈ వైరస్ కు  దొరకలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు  విరుగుడు కనిపెట్టేందుకు ఎన్నో పరిశోధనలు చేస్తున్న  ఫలితం మాత్రం దక్కలేదు. అయితే మొదట చైనా దేశంలో గుర్తించబడిన ఈ మహమ్మారి వైరస్ చైనాలు విజృంభించిన విషయం తెలిసిందే. కొన్ని రోజులపాటు మరణ మృదంగం మోగించి ఏకంగా మూడు వేల మందికిపైగా పొట్టన పెట్టుకుంది. ఇక అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చు అనే అనుమానాలు కూడా వున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే ఈ వైరస్ ప్రభావం చైనా దేశంలో తగ్గుతూ వస్తుంది. 

 

 ఈ నేపథ్యంలో చైనా దేశంలో కరోనా వైరస్ కి విరుగుడు కనిపెట్టారు అనే అనుమానాలు ఉన్నాయి.  కానీ అది తెరమీదికి తెస్తే మాత్రం..  కావాలనే వైరస్ ను  వ్యాప్తి చేసి ఆ తర్వాత విరుగుడు కనిపెట్టారు అని ప్రపంచ దేశాలు  యుద్ధానికి సిద్ధం అయ్యే  అవకాశం ఉంది కాబట్టి తెరమీదకు తీసుకు రావడం లేదు చైనా ప్రభుత్వం. అయితే ఈ పరిశోధనల్లో భాగంగా అనే జర్మనీ దేశంలో ఈ వైరస్ కు  సంబంధించిన వ్యాక్సిన్ కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇక ఈ వైరస్ క్లినికల్ ట్రయల్స్ చేయడానికి పద్దెనిమిది నెలల సమయం పడుతుందని చెప్పారు. ఇదే సమయంలో అమెరికా జర్మనీ తయారుచేసిన కరోనా  వైరస్ వ్యాక్సిన్  ను కొనుగోలు చేస్తాం అంటూ జర్మనీ కి ఆఫర్ ఇవ్వడం పై జర్మనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

 


 ఇక అంతే కాకుండా జర్మనీ దేశానికి ప్రపంచ దేశాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ కరోనా  వైరస్ కి వ్యాక్సిన్ అమెరికాలో కనిపెట్టి ఉంటే ముందుగా అమెరికా ప్రజల ప్రయోజనాలు చూసుకున్న తర్వాతనే మిగతా దేశాలకు ఎక్కువ ధరకు ఈ వ్యాక్సిన్ను అమ్మడానికి సిద్ధమయ్యేది  అమెరికా. ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ ఎట్టి పరిస్థితుల్లో అమెరికా చేతికి వెళ్లకుండా ఉండేందుకు ప్రపంచ దేశాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక అమెరికా ఇచ్చినా వ్యాక్సిన్ పై  అటు జర్మనీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: