ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ వణికిస్తోంది. అయితే.. ప్రస్తుతం 164 దేశాలకు వ్యాప్తి చెందింది ఆ విషయం తెలిసిందే.. ఇప్పటివరకు 2 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఈ మహమ్మారి బారిన పడి సుమారు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అలాగే మరణాలు కూడా పెరుగుతూ పోతున్నాయి. మరణాల సంఖ్యలో మొదటి స్థానంలో చైనా ఉంటే.. తర్వాత స్థానంలో ఇటలీ, ఇరాన్, స్పెయిన్‌ లో మరణాలు అధికంగా ఉన్నాయి.

 

ఇప్పటి వరకు చైనాలో 3,237 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బాధిత కేసులు 80,894 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ వైరస్ బారిన పడ్డ 82,763 మంది కోలుకున్నారు. మరో 6,415 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మన దేశంలో మంగళవారం ఒక్క రోజే కొత్తగా 24 కేసులు నమోదయ్యాయి. దీంతో మన దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 147కి చేరింది. మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణాలో కరోనా కేసులు 5 కి చేరుకున్నాయి. ఏపీలో మాత్రం 2  కేసులు ఉన్నట్లు తేలింది.      


ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బుధవారం ప్రకటన చేసింది. మనదేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 42 కేసులు నమోదయ్యాయి. పుణేకు చెందిన 28 ఏళ్ల మహిళకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యిందని, ఆమె ఇటీవల ఫ్రాన్స్, నెదర్లాండ్‌ లో పర్యటించినట్టు గుర్తించారు. దేశంలో మంగళవారం మూడో కరోనా మరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ కరోనా ప్రభావితం తీవ్రంగా ఉన్న ఇటలీలో ఇప్పటి వరకు 345 మంది ప్రాణాలు కోల్పోయారు. 

 

దీంతో అక్కడ మరణాల సంఖ్య దాదాపు చైనా మరణాల సంఖ్యకు చేరువవుతోంది. అయితే ఇటలీలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 2,503 కు చేరింది. కొత్తగా మరో 3,526 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో భాదిత సంఖ్య కేసులు 31,500 దాటింది. ఇటలీలో రోమ్‌, మిలాన్‌ సహా పలు నగరాల్లో క్రీడా మైదానాలు మూసివేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: