ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి అనుకుంటున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా  ప్రభావం ఎక్కువగా ఉండటం వల్లే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశామని చెబుతోంది ఎన్నికల సంఘం. అయితే దీనినే జగన్ సర్కారు తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. కావాలనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని దానికి కరోనా వైరస్ అనే ఓ కారణాన్ని చూపుతున్నారంటూ ఆరోపిస్తోంది జగన్ సర్కార్. ఇక దీనిపై ఏకంగా సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. 

 

 అయితే జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో  పేర్కొన్నా ఒక అంశంపై ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు . అదేంటంటే స్థానిక ఎన్నికలు జరిగి ఉంటే కరోనా  వైరస్ ప్రభావం తగ్గించే వాళ్ళము అంటూ పిటిషన్లో పేర్కొంది జగన్ సర్కార్. ఒకరకంగా జగన్ సర్కారు చెప్పింది కరెక్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఉంటే గ్రౌండ్ లెవల్లో  కూడా పాలకులు  ఏర్పడి.. సమర్థవంతంగా కరోనా ను  నియంత్రించే అవకాశం ఉండేది  అని జగన్ సర్కార్ పేర్కొంది అంటున్నారు. అయితే జగన్ చెప్పింది కరెక్టే అయినప్పటికీ చెప్పిన విధానం మాత్రం సరైనది కాదు అంటున్నారు. కరోనా  వైరస్ ను నియంత్రించడానికి స్థానిక సంస్థల ఎన్నికలను కారణంగా చూడడం సరైనది కాదు అంటున్నారు. 

 

 ఒకరకంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితేనే  కరోనా  ప్రభావం ఎక్కువ ఉండే  అవకాశాలున్నాయని అంటున్నారు. ఎందుకంటే ఎన్నికల హడావిడి లో ప్రజల ఆరోగ్యాన్ని అధికారులు అంతగా  పట్టించుకోరని కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతుంది అంటున్నారు. ఒకవేళ ఎన్నికలు జరగకపోతే గ్రౌండ్ లెవల్ లో పాలకులు లేకున్నప్పటికీ అధికారులు ప్రజల ఆరోగ్యం పైనే ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఎన్నికల వాయిదాకు ఎన్నికల సంఘం కరోనా ను  కారణంగా చూపడం వల్ల జగన్ సర్కారు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కరోనా  వైరస్ ని బాగా చేసేవాళ్ళం  అనుకోవడం సరైనది కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: