ప్రస్తుతం ప్రపంచ దేశాలలో కరోనా  వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. చైనాలో గుర్తించబడిన ఈ ప్రాణాంతకమైన వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా ఇటలీ దేశంలో అయితే ఈ వైరస్ ప్రభావం చైనా దేశం కంటే ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా  వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నో వదంతులు కూడా తెర మీదకు వస్తున్నాయి... అంతే కాకుండా ఎంతో మంది ప్రముఖులు చిత్రవిచిత్రమైన సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించే మాత్రలు వాడడం వల్ల కరోనా  వైరస్ తగ్గిపోతుందని చెబుతూ ఉండడం.. ఇంకొంత మంది మలేరియా మాత్రలు వాడడం వల్ల కరోనా  వైరస్ తగ్గింది అని చెప్పడం చేస్తున్నారు. 

 

 ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పారాసిట్మల్ వేసుకుంటే కరోనా  వైరస్ తగ్గిపోతుంది అని చెప్పడం వల్ల ప్రస్తుతం ప్రజలు ఇలాంటి టాబ్లెట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై  విశ్లేషకులు కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే ప్రస్తుతం రోజురోజుకు ఇటలీ దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఓ వార్త బయటకు వచ్చింది. ఇటలీలో ఎక్కువమంది చనిపోవడానికి కారణం జ్వరం తగ్గడానికి వేసుకున్న ఒక మాత్ర అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. అయితే ఇటలీలో కరోనా  ప్రభావం ఎక్కువగా అవ్వడానికి కారణం ఏంటి  అని రీసెర్చ్  చేస్తే అసలు విషయం బయటపడింది. 

 

 అక్కడ చాలామంది ఇబు ప్రొఫైన్ ... అంటే ఇక్కడ పారాసిటమాల్ టాబ్లెట్ ఎలా ఉందో అక్కడ ఇబు ప్రొఫైన్  అనే టాబ్లెట్స్ వాడారు అని తేలింది. అయితే ఇటలీ లోని ప్రజలందరూ ఎక్కువ మోతాదులో ఇబుప్రొఫైన్  టాబ్లెట్ వాడడం వల్ల కరుణ వైరస్ కు  మరింత బలం చేకూరి తీవ్రస్థాయిలో పెరిగిపోయి మరణాల సంఖ్య పెరిగింది అంటూ అక్కడి ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కరోనా  లక్షణాలు కనిపిస్తే ఇంట్లో పారాసిట్మల్ టాబ్లెట్ వేసుకోవడం ద్వారా కరోనా  వైరస్ తగ్గదు అంటున్నారు విశ్లేషకులు. ముందుగా కరోనా  లక్షణాలు కనిపిస్తే దానిని ఐసొలేట్  చేసి బయటి వారికి వ్యాపించకుండా చేయాలని.. లేదా క్వారంటైన్  లో ప్రత్యేక చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమ్  డాక్టర్లు చెప్పినట్లు గా పారాసెట్మాల్ టాబ్లెట్ లు అదేపనిగా వాడకండి  అంటూ సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: