ఎస్ ఇది నిజ‌మే న‌ట‌. ఇప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణికించేస్తోన్న క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో వ్య‌వ‌స్థ‌లే కాదు ఓవ‌రాల్‌గా పరుగులు పెట్టే ప్ర‌పంచ‌మే ఆగిపోయేలా ఉంది. ఏ రంగంలో చూసినా బ్రేకులు ప‌డిపోతున్నాయి. ఎన్నిక‌లు వాయిదా ప‌డుతున్నాయి.. ఓ వైపు ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ సైతం మంద‌గించింది. చైనా ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా కుదేలైంది. ఇక ఇరాన్ అయితే 80 ఏళ్ల‌కు పైన ఉన్న వారికి సోకితే వైద్యం చేయ‌లేమ‌ని చేతులు కూడా ఎత్తేసింది. క‌రోనా వైర‌స్ అంతలా ప్ర‌పంచాన్ని భ‌య పెడుతోంది. ఇక మ‌న‌దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా సోకిన వారి సంఖ్య 150 దాటింది. ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా 2 లక్ష‌లు క్రాస్ అవ్వ‌గా.. ఈ వైర‌స్ సోకి మృతి చెందిన వారు ఇప్ప‌టి వ‌ర‌కు 8 వేలు దాటారు.



ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే క‌రోనా సోకిన వారి సంఖ్య తెలంగాణ‌లో 6కు చేరుకుంది. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా క‌రోనా అరిక‌ట్టేందుకు ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే అనంత‌గిరిలోని చాతి ఆసుప‌త్రి, హ‌రిత రిసార్ట్స్ ద‌గ్గ‌ర క‌రోనా ఐసోలేష‌న్ సెంట‌ర్ ఏర్పాటు చేసింది. ఇదే ఇప్పుడు వికారాబాద్ ఎమ్మెల్యే మెత‌కు ఆనంద్‌ను టెన్ష‌న్ పెడుతోంద‌ట‌. సాధార‌ణంగా ఎవ‌రు అయినా మా ఊర్లో హాస్ప‌ట‌ల్ పెట్టండి.. అని కోరుకుంటారు. కానీ అనంత‌గిరి వాసులు మాత్రం మా ద‌గ్గ‌ర హాస్ప‌ట‌ల్ వ‌ద్దు.. మాకు రోగుల‌ను తీసుకురావ‌ద్దు అని ఎమ్మెల్యే మెత‌కు ఆనంద్‌ను క‌లిసి విన‌తిప‌త్రం ఇవ్వడంతో పాటు ఆందోళ‌న చేస్తున్నారు.



వాస్త‌వంగా తెలంగాణ ప్ర‌భుత్వం క‌రోనా రోగుల కోసం క‌రోనా ఐసోలేష‌న్ సెంట‌ర్ ఏర్పాటుకు దూల‌ప‌ల్లి ఫారెస్ట్ అకాడ‌మీ, గ‌చ్చిబౌలీ ఇండోర్ స్టేడియంల‌తో పాటు వికారాబాద్ చాతీ ఆసుప‌త్రి, హ‌రిత రిసార్ట్స్ ల‌ను పరిశీలించారు. ఇక ఫైన‌ల్‌గా అనంతగిరి హ‌రిత రిసార్ట్‌లోనే ఆఘ‌మేఘాల మీద ఐసోలేష‌న్ సెంట‌ర్ ఏర్పాటు చేశారు.  అయితే ఇప్పుడు దీనిపై స్థానికంగా నియోజ‌క‌వ‌ర్గ వాసుల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌డంతో ఇదే క‌రోనారా బాబు అని ఆనంద్ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ట‌. అది అస‌లు సంగ‌తి.

మరింత సమాచారం తెలుసుకోండి: