ఆంధ్రప్రదేశ్‌లో స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ త‌న విచ‌క్ష‌ణ ఉప‌యోగించి వాయిదా వేశారు. నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులు. గ‌తంలో ర‌మేష్ కుమార్తె నిమ్మ‌గ‌డ్డ శ‌ర‌ణ్య సైతం గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఓ నామినేటెడ్ ప‌ద‌వి కూడా పొందార‌ని.. ఇప్పుడు త‌న స‌న్నిహితుడు అయిన బాబోరి ప‌చ్చ పార్టీ చాలా క‌ష్టాల్లో ఉండ‌డంతో ఆ పార్టీ ప‌రువు.. బాబోరి పార్టీ ప‌రువు కాపాడేందుకు ఆయ‌న ఎన్నిక‌లు వాయిదా వేశార‌న్న ఆరోప‌ణ‌లు వైసీపీ నుంచి ఉన్నాయి.



అంతెందుకు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సైతం చివ‌ర‌కు ఈసీ తీరును ప్రెస్‌మీట్ ప్ర‌శ్నించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ విష‌యంలో తాడో పేడో తేల్చుకునేందుకు చివ‌ర‌కు వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై బుధ‌వారం ఉద‌యం సుప్రీంకోర్టులో 40 నిమిషాల పాటు విచార‌ణ కొన‌సాగింది. ఏపీలో ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తూ వైసీపీ కోర్టులో వేసిన పిటిష‌న్‌పై  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.


చివ‌ర‌కు ఎన్నిక‌లు వాయిదా ప‌డినా కోడ్ ఎత్తి వేయాల‌ని తీర్పు వ‌చ్చింది. ఏదేమైనా ఏక‌గ్రీవాల్లో తిరుగులేని విజ‌యాల‌తో జోరు మీదున్న వైసీపీకి బాబోరు తాత్కాలికంగా బ్రేక్ వేసినా ఆయ‌న స్వ‌ల్ప కాలిక ఆనందం పోందండం మిన‌హా ఒరిగేది ఏం ఉండ‌దు. రేపో మాపో ఆరు వారాల త‌ర్వాత మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌రిగితే ఈ సారి వైసీపీ మ‌రింత విజృంభించ‌డం ఖాయం. ఎందుకంటే ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాక 13 జిల్లాల్లో చాలా చోట్ల కీల‌క నేత‌లు వైసీపీలోకి జంప్ చేసేస్తున్నారు. అనంత‌పురం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యేలు యామినీ బాల‌, శమంత‌క మ‌ణి కూడా పార్టీ మారిపోతున్నారు. ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాక జ‌రిగితే బాబోరికి ఉన్న కాస్త ప‌రువు కూడా పోతుందన‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: