ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక యువకుడు ఎంబీఏ పూర్తి చేసుకొని కొద్ది నెలల క్రితం హైదరాబాద్ కు మకాం మార్చాడు. ఇక్కడికి వచ్చాక అమీర్‌ పేటలోని ఒక చిన్న సంస్థలో హెచ్ఆర్ మేనేజర్‌ గా ఆ యువకుడు పనిచేస్తున్నాడు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఆ వ్యక్తి నివసించే ఇంటి పక్కనే ఉండే వివాహిత ( భర్త నుంచి విడిపోయిన) పిల్లలతో కలిసి ఉండేది. వీరిద్దరి మధ్య కాల క్రమంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. 

 


కొన్ని రోజుల క్రితం తన కొడుకు జన్మదిన వేడుకలకు ఆ యువకుడిని పార్టీకి ఆహ్వానించింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వ్యవహారం కాస్త ముదిరి అక్రమ సంబంధానికి దారితీసింది. సదరు యువకుడు ఆఫీసు నుంచి వచ్చాక తన గదిలో కంటే ఆమె ఇంట్లోనే ఎక్కువసేపు ఉండేవాడు. అక్కడ ఉండి ఆమెతో శారీరక వాంఛలు తీర్చుకునేవాడు. ఏమైందో తెలియదు కొద్దిరోజుల తర్వాత వీరిద్దరూ మనస్పర్థలు రావడంతో ఆ యువకుడు ఆమెను దూరంగా ఉంచడం, అలాగే తన నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చడంలాంటివి చేసాడు అతను. ఇలా చేయడంతో తనను దూరం పెట్టాడన్న కక్షతో ఆమె ప్రియుడిపై ఆవిడ కక్షగట్టింది.

 

 

దీనితో ఆమె ఏకంగా ఆ యువకుడి ఫేస్‌ బుక్ అకౌంట్‌ ను హ్యాక్ చేసి అచ్చు అలాగే ఉండే మరో ఫేక్ అకౌంట్ ని క్రియేట్ చేసింది. దానిలో అసభ్యకర మెసేజ్‌లు, ఫోటోలు పోస్ట్ చేసేది ఆమె. ఆవిడ ఆ యువకుడి యొక్క బంధువుల ఫోటోలు, వివరాలు సేకరించి వారిపై కూడా అసభ్యకర మెసేజ్‌ లు పోస్ట్ చేసేది. ఇందులో భాగంగా మెదక్‌ లో ఉండే ఆ యువకుడి బంధువు పైనా అలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో ఆయన పోలీసులకు తన గోడును వివరించాడు. 

 

 


ఈ దెబ్బతో మెదక్ పోలీసులు ఆ యువకుడిని ఆరా తీశారు. ఇలాంటివే ఇంకొంత బంధువుల నుంచి తనకు అలాంటి ఫిర్యాదులే రావడంతో అతడికి అనుమానమొచ్చింది. దీనితో ఆ యువకుడు ఆమె ఇంటికెళ్లి ఆరా తీశాడు. దీనికి ఆమె నుంచి తనతో అక్రమ సంబంధం కొనసాగిస్తేనే ఫేస్‌బుక్ అకౌంట్ పాస్‌ వర్డ్స్ చెబుతానని ఆమె షరతులు పెట్టింది. ఆవిడతో తిరిగి అఫైర్ పెట్టుకోకపోతే పరువు తీస్తానని హెచ్చరించింది అని సదరు యువకుడు తెలిపాడు. 

 

 


ఈ విషయాలతో విసిగిపోయిన అతడు మంగళవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తన తరుపున ఫిర్యాదు చేశాడు. సదరు వివాహిత తనను లైంగికంగా వేధిస్తోందని, సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులతో పరువు తీస్తోందని ఆ ఫిర్యాదులో అతను పేర్కొన్నాడు. దీనితో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి విచారణ చేబడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: