ఈ మద్య దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అంతకు ముందు మంత్రుల క్వార్టర్స్ లో స్పీకర్ పోచారంతో కవిత భేటీ అయ్యారు.   ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతోనూ కవిత సమావేశం కానున్నారు.  ఈ రోజు మధ్యాహ్నం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ వేయడానికి వెళ్తుండగా ఆమె కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది.

 

హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తుండగా కాన్వాయ్‌ తుప్రాన్‌ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కారును కాన్వాయ్‌లోని మరో కారు ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆ ఎమ్మెల్యే కారు ధ్వంసమైంది.. కాకపోతే ఈ కారులో jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి లేనట్లుగా చెబుతున్నారు.  దాంతో ఆయనకు పెను ప్రమాదం తప్పినట్లుగా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.   ప్రమాదం జరిగినా అది పెద్దది కాకపోవడంతో గాయాలు ఏవీ కాలేదు. నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు గల ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో 95శాతానికి పైగా టీఆర్‌ఎస్ వారే ఉన్నారు.

 

దీంతో కవిత విజయం దాదాపు ఖరారైనట్లేనని చెబుతున్నారు. అయితే తనకు ఏ ప్రమాదం జరగలేదని.. తాను క్షేమంగా ఉన్నానని jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి తెలిపారు.. కాగా, గత లోక్‌ సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె బీజేపీ నేత అర్వింద్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్సీగా ఆమెను సీఎం కేసీఆర్ పోటీకి దింపుతున్నారు. మరోవైపు నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్‌ వేసిన కవితకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు  అంటూ తెలంగాణ మంత్రి హరీశ్ రావు తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: