ప్రస్తుతం రైల్వే ప్రయాణం ఎక్కువగా చేస్తుంటాము. కానీ.. కొన్ని సందర్భాలలో అనుకోకుండా ప్రయాణాన్ని చివరి నిమిషంలో వాయిదా వేసుకోవలసి ఉంటుంది. దీంతో చేసేదేమి లేక టికెట్ క్యాన్సిల్ చేసుకుంటారు. టికెట్ కాన్సల్ చేసుకుంటే కొంత మొత్తం లో చేతికొస్తుంది. మిగిలిన డబ్బులు మాత్రం మన చేతికి రావు. కానీ బెంగళూరుకు చెందిన కన్ఫార్మ్‌ టికెట్ స్టార్టప్ మాత్రం రైల్వే ప్రయాణికుల కోసం ఫ్రీ క్యాన్సలేషన్ ప్రొటెక్షన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
 

అంటే మనం టికెట్ తీసుకునేటప్పుడు ఈ ప్రొటెక్షన్ ప్లాన్ ఎంచుకుంటే టికెట్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు పూర్తి డబ్బును వెనక్కి వస్తుందట. టికెట్ డబ్బులు ఫుల్ రిఫండ్ వస్తాయని అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక కిటుకు ఉందండోయ్. ఫ్రీ క్యాన్సలేషన్ ప్రొటెక్షన్ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులు రైలు స్టార్ట్ అవ్వడానికంటే 4 గంటల ముందు లేదా చార్ట్ ప్రిపేర్ అయ్యేలోపు బుక్ చేసిన టికెట్‌ ను రద్దు చేసుకోవాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. సాధారణంగా తత్కాల్ టికెట్ బుక్ చేసుకుంటే మళ్ళి ఆ టికెట్‌ ను క్యాన్సల్ చేసుకోవడానికి లేదు. 


కానీ ఈ ప్లాన్ నుంచి టికెట్ బుక్ చేసుకోవటం వలన తత్కాల్ టికెట్లకు కాన్సల్ చేసుకుంటే ఫ్రీ క్యాన్సలేషన్ ప్రొటెక్షన్ ప్లాన్ వర్తిస్తుంది. మన డబ్బులు మన ఖాతాలోకి పడిపోతాయి. కన్ఫార్మ్‌ టికెట్ కోఫౌండర్ సీఈవో దినేశ్ కుమార్ మాట్లాడారు. మనం అనుకుని పరిస్థితులలో మనం ప్రయాణాన్ని రద్దు చేసుకుంటాము. కానీ మనం చెల్లించిన డబ్బులు తిరిగి రావు. కస్టమర్లు క్యాన్సలేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకు ప్రయాణికులకు అనుగుణంగా ఫ్రీ క్యాన్సలేషన్ ప్రొటెక్షన్ ప్లాన్ తెచ్చామని పేర్కొన్నారు. వెయిటింగ్ లిస్ట్‌ లో ఉన్న టికెట్లు కన్ఫార్మ్ అయ్యే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయో చెప్తాయి. అలాగే ప్రత్యామ్నాయాలను కూడా సూచిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: