ప్రపంచంలో అన్నీ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పటిలో తగ్గుముఖం పట్టి అలా కనిపించడం లేదు. చాపకింద నీరులా భారతదేశంలో నిదానంగా మొదలైన మహమ్మారి ఇప్పుడు బాధిత భారతీయుల సంఖ్య 100 వరకు పెంచుకుంటూ పోతోంది. అత్యధికంగా మహారాష్ట్రలో కరుణా వైరస్ బాధితుల సంఖ్య ఉండగా అత్యల్పంగా ఒక కేసు ఆంధ్రప్రదేశ్లో నమోదయింది. ఇకపోతే ఇప్పటికే నలుగురు భారతీయులు ప్రాణాలు దీనివల్ల గాల్లో కలవగా... తెలంగాణలో రోజే నాలుగవ కరోనా పాజిటివ్ కేసు నమోదయింది.

 

సరే మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో దీని తాకిడి  తక్కువగా ఉన్నా వేరే దేశంలో మాత్రం కొన్ని వందల మంది కరోనా బాధితులు ఉంటే అందులో 200 మంది మన భారతీయులే కావడం గమనార్హం. ఇటీవల భారత దేశం ఇరాన్ దేశానికి తీర్థయాత్రకు వెళ్ళినా 254 మంది భారతీయులకు కరోనా వైరస్ ఉందని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. వెళ్ళిన ప్రతి ఒక్కరికీ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ టీం టెస్టులు చేసి మరీ ప్రకటించింది. దీంతో ఇరాన్ దేశం లో చిక్కుకుపోయిన భారత పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావటానికి విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది.

 

అయితే భారత ప్రభుత్వం మాత్రం కరోనా ను అరికట్టడంలో ఏమాత్రం ఉదాసీనత చూపించకపోవడం హర్షించదగ్గ విషయం. దీనిలో భాగంగా మొదట కరోనా టెస్టులు నిర్వహించి రిపోర్టులో నెగిటివ్ వచ్చిన వారిని మొదట దేశంలోకి తీసుకురావడానికి ఢిల్లీ ఫ్లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా వారిని అక్కడే ఉంచేసింది. దేశంలోనే మన దేశం తరఫున ఒక ల్యాబ్ లు ఏర్పాటు చేసి దేశ పౌరులకు పూర్తిగా వైరస్ తగ్గిపోయాక దేశానికి తీసుకురావటానికి కేంద్ర వైద్య శాఖ ఆలోచిస్తుంది. వీళ్లంతా జమ్మూకాశ్మీర్ మరియు లడఖ్ ప్రాంతాలకు చెందిన వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: