ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను బెంబేలెత్తిస్తున్న ప్రాణాంతకమైన కరోనా వైరస్ భారతదేశం కూడా చేరిన విషయం తెలిసిందే. భారత్లో ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో విజృంభిస్తుంది కరోనా . రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రోజురోజుకు కఠిన నిబంధనలు అమలులోకి తెస్తోంది. అంతేకాకుండా కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కూడా ఎన్నో చర్యలు చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం. రోజురోజుకు కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువ ఉండటంతో.. ఎన్నో కీలక చర్యలు తీసుకుంటున్నది  కేంద్ర ప్రభుత్వం. ఇక అటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో చర్యలు చేపడుతున్నాయి ఇప్పటి వరకు దేశంలో 8 రాష్ట్రాలు  పూర్తిగా షట్ డౌన్  అయ్యాయి అని చెప్పాలి. 

 

 

 ఇక రోజురోజుకు కరోనా  పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో ప్రాణభయం పాతుకు పోతుంది. అయితే అటు కరోనా  వ్యాప్తి నేపథ్యంలో భారత ఆర్మీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా... కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు ఇప్పటికే పలు కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు భారత ఆర్మీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వార్ గేమ్స్, కాన్ఫరెన్స్ లను  వాయిదా వేసుకోవాలని.. భారత ఆర్మీ లోని అన్ని కామండ్స్ కి  ఆదేశాలు జారీ చేసింది భారత ఆర్మీ. భారత ఆర్మీ నుంచి తదుపరి ఉత్తర్వులు అందే వరకు... ఈ వాయిదా కొనసాగుతూనే ఉంటుంది అంటూ స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా భారత ఆర్మీ ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది భారత ఆర్మీ. 

 

 

 అయితే ఇప్పటికే భారత దేశంలో 150 కరుణ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కూడా ఈ మాయదారి మహమ్మారి అడుగు పెట్టింది. తాజాగా పశ్చిమ బెంగాల్ లో మొదటి  కరోనా  కేసు నమోదైంది. ఇక దేశంలోని అన్ని రాష్ట్రాలలో అత్యధికంగా మహారాష్ట్రలో 42 కరోనా పాజిటివ్  కేసులు నమోదయ్యాయి. ఇక ఆ తర్వాత కేరళలో 27, ఉత్తరప్రదేశ్లో 16, హర్యానాలో 16, కర్ణాటకలో 11, ఢిల్లీలో 10, లడక్లో 8 కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మందికి కరోనా  బాధితులు ఉండగా.. ఇప్పుడు వరకు దాదాపు తొమ్మిది వేల మంది ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: